tulsi
చలికాలం వచ్చింది అంటే చాలు మనకు ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో స్పెషల్ గా చెక్కర్లేదు. అయితే.. మనకు మాత్రమే కాదు.. ఈ చలికాలంలో మొక్కలు కూడా అంత ఈజీగా సర్వైవ్ అవ్వలేవు. అప్పటి వరకు పచ్చగా ఉన్న మొక్క అయినా.. చల్లని గాలులకు దెబ్బతిని చనిపోతూ ఉంటుంది. ఎక్కువగా తులసి మొక్కతో ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. చలికాలంలో తులసి మొక్క తొందరగా చనిపోతూ ఉంటుంది. మరి.. అలా అవ్వకుండా ఉండాలంటే.. ఏం చేయాలో ఓసారి చూద్దాం..
తులసి మొక్క చలికి చనిపోకుండా ఉండాలి అంటే... మొక్కను బయట ఉంచకూడదు. ఎక్కువ చల్లగాలులు తగిలే చోటు కాకుండా.. కొంచెం తక్కువ గాలులు వచ్చే ప్రదేశంలో మొక్కను పెంచాలి. అప్పుడు.. తొందరగా తులసి మొక్కకి ఏమీ కాకుండా ఉంటుంది.
ఇక.. చలికాలంలో ఎప్పటి లాగా కాకుండా.. కాస్త తక్కువగా నీరు పోయాలి. అసలు పోయకుండా వదిలేయకూడదు. అలా అని.. ఎండాకాలంలో పోసినట్లుగా ఎక్కువగా పోయకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకొని నీరు పోయాలి.
కుండీలో మీరు మొక్క పెంచుతున్నట్లయితే.. మట్టి ఎండిపోకుండా చూసుకోవాలి. కొంచెం, కొంచెంగా అయినా నీరు పోస్తూ ఉండాలి. చలికాలమే కదా పెద్దగా అవసరం ఉండదు అని పూర్తిగా వదిలేయకూడదు.
మొక్క మొత్తం ఆరోగ్యంగా ఉన్నా.. కొన్ని చిరవలు మాత్రం పాడౌతూ ఉంటాయి. అలాంటి వాటిని అలాగే ఉంచితే.. మొక్క మొత్తం పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి... అలా కాకుండా.. పాడైన ఆకులు, కొమ్మలను ఎప్పటికప్పడు తుంచేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల మొక్క మంచిగా పెరుగుతుంది.
తులసి మొక్క చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. ఎక్కువ చలిగాలులను తట్టుకోలేదు. కాబట్టి... రాత్రిపూట మొక్కను ఇండోర్ ప్లేస్ లోకి మార్చేయండి. అలా మార్చడనికి వీలు లేకపోతే.. మొక్కపై ఏదైనా క్లాత్ కప్పండి. అప్పుడు మొక్కకి ఏమీ కాకుండా ఉంటుంది.
ఇక చలికాలంలో మార్నింగ్ టైమ్ లో మొక్కకి ఎండ కొంచమైనా తగిలేలా చూసుకోవాలి. అసలు పూర్తిగా ఎండ తగలకపోతే.. మొక్క బతికే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ జాగ్రత్తలు ఫాలో అయితే.. చలికాలంలోనూ తులసి మొక్కను జాగ్రత్తగా చూసుకోవచ్చు.