Galam Venkata Rao | Published: Feb 27, 2025, 9:00 PM IST
తెలుగు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై స్నేహితుడే సంచలన ఆరోపణలు చేశారు. రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి టార్చర్ భరించలేక ఆ*త్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో, లెటర్ విడుదల చేశారు. రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందన్న శ్రీనివాసరావు.. యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. సన్నిహితులకు సెల్ఫీ వీడియో, లెటర్ పంపిన శ్రీనివాసరావు... వాటి ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.