యాలకుల నుంచి జీలకర్ర వరకు.. ఏయే మసాలా మొక్కలను కుండీల్లో ఈజీగా పెంచొచ్చో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Jul 20, 2024, 1:02 PM IST

మనలో చాలా మంది మసాలా మొక్కలు మన దగ్గర పడవు.. వాటిని పండించలేమని అనుకుంటుంటారు. కానీ మనం కూడా ఈజీగా మసాలా మొక్కలను పెంచొచ్చు. అదికూడా కుండీల్లో.. అదెలాగంటే?
 


మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ.. వార్షాకాలంలో ఎంతటి మొక్కనైనా ఈజీగా పెంచొచ్చు. పువ్వులు, కాయలు కాసేలా చేయొచ్చు. కాయలు కాసే మొక్కైనా, తీగ మొక్క అయినా సరే వర్షాకాలంలో చాలా తొందరగా పెరుగుతాయి. అందుకే ఈ సీజన్ లో రైతులు రకరకాల పంటలను పండిస్తారు. చెట్లు, మొక్కలు, విత్తనాలను నాటుతారు. ఒక్క రైతులే కాకుండా.. ఇంట్లో మీరు కూడా రకరకాల మసాలా దినుసుల మొక్కలను నాటి పండించొచ్చు. అదికూడా కుండీల్లో. మరి వర్షాకాలంలో ఈజీగా పండించగల కొన్ని సమాలా మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

వర్షాకాలంలో ఏ మసాలా మొక్కలను నాటాలి? 

Latest Videos

undefined


కొత్తిమీర: కొత్తిమీర ఆకులే కాదు.. కొత్తమీర గింజలు అదే ధనియాలు కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ రెండింటిని మనం ఎన్నో వంటల్లో రోజూ వేస్తూనే ఉంటాం. ఈ కొత్తిమీర రేట్లు పెరుగుతుంటాయి. ఒక్కోసారి తగ్గుతుంటాయి. అయితే ఈ కొత్తమీరను మీరు బయట కొనకుండా.. మీరే స్వయంగా పండించొచ్చు.అవును వీటిని ఒక పూల కుండీల్లో సులువుగా పెంచొచ్చు. మట్టిలో మట్టిపోసి ధనియాలను వేయండి. దీనిని బాల్కనీలో పెడితే సరి. అయితే కొత్తిమీరకు ఎండ తగలకుండా ఉండాలి.

పుదీనా: పుదీనా మొక్కను పెంచడం చాలా ఈజీ. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అందులోనూ పుదీనా ఫుడ్ కు మంచి వాసన, టేస్ట్ ను ఇస్తుంది. కాబట్టి మీరు ఇంట్లోనే పండించండి. అది కూడా కుండీలో. ఒక కుండీలో మట్టిపోసి అందులో వేరు ఉన్న పుదీనా మొక్కను నాటండి. ఈ ఒక్క మొక్క గుంపులు గుంపులుగా పెరుగుతుంది. దీనికి అప్పుడప్పుడు కొన్ని నీళ్లను పోస్తే సరిపోతుంది.

అల్లం: అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిని మనం రెగ్యులర్ గా కూరల్లో వేస్తూనే ఉంటాం. వీటిని ఎప్పుడూ బయట కొనే బదులుగా మీరు ఇంట్లోనే చాలా ఈజీగా పండించొచ్చు. అల్లాన్ని మీరు వెడల్పాటి కుండీలో లేదా పెరట్లో పెంచొచ్చు. అచ్చం పసుపు లాగే ఇది పండుతుంది. అల్లం వర్షాకాలంలో కూడా చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది.

వెల్లుల్లి: వెల్లుల్లి లేని కూరలు అసలే ఉండవు. ఇది కూరలను టేస్టీగా చేయడమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా అంతటి మేలు చేస్తాయి మరి. అయితే ఈ వెల్లుల్లిని కూడా మీరు కుండీలో చాలా ఈజీగా పండించొచ్చు. ఇందుకోసం మట్టిపోసిన కుండీలో వెల్లుల్లి రెబ్బలను నాటండి. వెల్లుల్లి మొక్క పెరగడానికి నీళ్లు ఎక్కువ అవసరం లేదు. నీళ్లను ఎక్కువగా పోస్తే వెల్లుల్లి మురిగిపోతుంది.

మిరప : పచ్చి మిరపకాయలను లేదా ఎర్ర మిరపకాయలను కూడా మీరు కుండీల్లో పెంచొచ్చు. వానాకాలంలో మిరప మొక్కలు మంచి పంటను ఇస్తాయి. కాబట్టి మీరు కూడా వర్షాకాలంలో మిరప మొక్కలను నాటండి. 

జీలకర్ర: జీలకర్రను పోపుల్లో ఖచ్చితంగా వేస్తారు. ఈ జీలకర్ర రేటు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. చాలా మంది ఇవి మన దగ్గర పండవని అనుకుంటారు. కానీ జీలకర్రను కూడా మీరు ఈజీగా పండించొచ్చు. అది కూడా కుండీలో. వర్షాకాలంలో జీలకర్ర వేగంగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తుంది.

పసుపు: అల్లం, వెల్లుల్లి లాగే మీరు వానాకాలంలో పసుపును కూడా పండించొచ్చు. ఇందుకోసం పచ్చి పసుపు కొమ్ములను తీసుకుని మట్టి కుండీల్లో నాటండి. వర్షాకాలంలో పసుపు మొక్క చాలా వేగంగా పెరుగుతుంది.

లవంగాలు:  లవంగాలను కూడా  మనం చాలా ఈజీగా ఇంట్లో పండించొచ్చు తెలుసా? అందుకే ఈ సీజన్ లో లవంగాల మొక్కలను నర్సరీ నుంచి లేదా ఆన్‌లైన్‌లో కొని మీ బాల్కనీలో నాటండి. ఈ సీజన్ లో లవంగాలు బాగా పండుతాయి. 

నల్ల మిరియాలు: నల్ల మిరియాలను కూడా పండుతాయా? అని మీకు డౌట్ రావొచ్చు. కానీ వర్షకాలంలో నల్ల మిరియాలు బాగా పండుతాయి. ఈ వర్షాకాలంలో నల్ల మిరియాల మొక్కను నాటితే.. అది ఫాస్ట్ గా పెరుగుతుంది. 

యాలకులు - వర్షాకాలంలో యాలకుల మొక్క బాగా పెరుగుతుంది. కాబట్టి మీరు మీ ఇంటి బాల్కనీలో యాలకుల మొక్కను నాటి పెంచండి. మీరు పండించిన యాలకులను రకరకాల వంటల్లో వేయొచ్చు. 
 

click me!