మీకు మీ ఇంటికి ఫ్రెష్ ఎయిర్ ఇచ్చే 7 అద్భుతమైన మొక్కలివిగో

By Naga Surya Phani Kumar  |  First Published Oct 2, 2024, 10:35 PM IST

వర్షాకాలంలో మొక్కలు వేస్తే బతకవని అంటుంటారు కదా. కాని ఈ మొక్కలు వర్షాకాలంలో, అధిక తేమ ఉన్నప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవించగలవు. అంతేకాకుండా గాలిలో తేమను తీసుకొని గాలిని శుభ్రం చేస్తాయి. అంటే ఇవి ఎయిర్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తాయి. ఈ మొక్కలు తక్కువ లైట్, తక్కువ వాటర్ ఉన్నా జీవించే శక్తిని కలిగి ఉంటాయి. అందుకే వీటిని ఇళ్ల లోపల కూడా పెంచుతారు. ఇవి ఆకర్షణీయంగా ఉంటాయి. పరిమళాన్ని వెదజల్లుతాయి. అలాంటి  7 రకాల అందమైన మొక్కల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 


బోస్టన్ ఫెర్న్(Boston Fern)

అమెరికాకు చెందిన బోస్టన్ ఫెర్న్ మొక్క ఇప్పుడు ఎక్కడ చూసినా ఇళ్లలో కనిపిస్తోంది. దీనికి కారణం ఏంటంటే ఇది చిన్న బాస్కెట్ లేదా బుట్టల్లోనూ ఈజీగా పెరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అధిక తేమ ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పెరుగుతుంది. ఇది సాధారణంగా చనిపోదు. మంచు వల్ల గడ్డకట్టిన నేలపైనా ఇది బతికే ఉంటుంది. నీళ్లు ఎక్కువైనా, అసలు నీరు పోయకపోయినా బతికే ఉండటం దీని ప్రత్యేకత. గాలిలో తేమను తీసుకొని గాలిని శుభ్రం చేస్తుంది. అందుకే అపార్ట్ మెంట్లలో ఈ మొక్కలు బాగా పెంచుతున్నారు. అందుకే ఇది ఇంటి మొక్కగా మారిపోయింది. 

స్పైడర్ ప్లాంట్(spider plant)

ఆఫ్రికాకు చెందిన ఈ మొక్క ఇప్పుడు ఇండియాలో ఇంటి మొక్కగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇది గాలిని శుద్ధి చేస్తుంది. అంతేకాకుండా వర్షాకాలంలోనూ వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరగగలదు. ఈ మొక్కలను రెండు రకాలుంటాయి. రెండూ ఇళ్లలో బాస్కెట్, కుండీల్లో పెంచుకోవడానికి వీలుగా ఉంటాయి. గాలిలో ఫార్మాల్డిహైడ్, జిలీన్ అనే టాక్సిన్ లను క్లీన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని నాసా గుర్తించింది. వీటిని పెంచడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. చిన్న కుండీల్లో వేసినా హాయిగా బతికేస్తాయి. వర్షాకాలంలో గాలిలో ఉండే అధిక తేమను గ్రహించి గాలిని శుద్ధి చేస్తుంది. 

స్నేక్‌ ప్లాంట్ (snake plant)

Latest Videos

undefined

ఈ మొక్క పశ్చిమ ఆఫ్రికాకు చెందిన మొక్క. ఇప్పుడు ప్రతి ఇంటిలో డెకరేషన్ కోసం ఉపయోగిస్తున్నారు. పాము లాంటి ఆకారం వల్ల దీనికి స్నేక్ ప్లాంట్ అని పేరొచ్చింది. ఇది హీట్ వాతావరణంలో ఆరుబయట పెరుగుతుంది. అదేవిధంగా చల్లని వాతావరణంలో ఇంట్లో పెరుగుతుంది. ఇది తక్కువ కాంతి, నీరు తక్కువ ఉన్నప్పటికీ పెరగే సామర్థ్యం ఉండటంతో ఇళ్లలో ఎక్కువగా పెంచుతుంటారు. శీతాకాలంలో రెండు నెలలకు ఒకసారి నీరు పోసినా ఇది బతకగలదు. ఇంకో విషయం ఏమిటంటే ఎక్కువ నీరు పోస్తే తేలికగా కుళ్లిపోతుంది. దీన్ని పెంచడానికి పెద్దగా మెయింటనెన్స్ అవసరం లేదు. ఇది కూడా గాలిని ఫిల్టర్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని నాసా కనుగొంది. 

ఆర్చిడ్స్ (orchids)

ఆర్చిడ్ మొక్కలు దాదాపు 800 రకాలు ఉన్నాయి. వివిధ రంగుల్లోనే కాకుండా వివిధ సువాసనలను ఇవి పంచుతాయి. ఆర్కిడ్లు కాస్మోపాలిటన్ మొక్కలు. ఇవి మంచు ప్రాంతాల్లో తప్ప భూమిపై దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన ఆర్కిడ్ జాతులు ఉష్ణమండల దేశాల్లో  కనిపిస్తాయి. ఈ పూలను ఎక్కువగా పర్ఫూమ్ తయారీలో ఉపయోగిస్తారు. ఇళ్లలో వీటిని అందం కోసం పెంచుతారు. అంతేకాకుండా పరిమళాన్ని వెదజల్లుతూ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తాయి. అందుకే వీటిని ఇళ్లలో పెంచడానికి ఇష్టపడతారు. ఈ పూల మొక్కలు గాలిలో తేమను తీసుకొని చక్కటి సువాసనను వెదజల్లుతాయి. 

ఫిలోడెండ్రాన్‌ (Philodendron)

ఫిలోడెండ్రాన్‌ మొక్కలను నీడ ఉన్న ప్రదేశాలలో కూడా పెంచవచ్చు. అందువల్ల ఇది ఇంటి మొక్కగా మారిపోయింది. వర్షాకాలంలోనూ నేలలో అధిక తేమ ఉన్నా ఇవి బాగానే పెరుగుతాయి. ఇళ్లలో వాటిని మట్టి కుండలు, నీటి కంటైనర్లలో పెంచవచ్చు. ఇండోర్ మొక్కలు 15 -18 °C మధ్య ఉష్ణోగ్రతల మధ్య కూడా పెరుగుతాయి. తక్కువ కాంతి ఉన్నా జీవించగలవు. 
ఫిలోడెండ్రాన్ పుష్పించే సమయంలో ఉత్పత్తి చేసిన రెసిన్‌లను తేనెటీగలు తమ గూళ్ళ నిర్మాణంలో ఉపయోగిస్తాయి. 

ఫిట్టోనియా(Fittonia)

దక్షిణ అమెరికాకు చెందిన మొక్క ఇది. నరాల మొక్క అని కూడా అంటారు. దీని అసాధారణ లక్షణాల వల్ల ఏ ప్రాంతంలోనైనా పెరగే శక్తి దీనికి ఉంది. వర్షాకాలంలో గాలిలో తేమను తీసుకొని జీవించగలదు. ఈ మొక్కలు వివిధ రకాల్లో ఉంటాయి. గ్రీన్, రెడ్ ఇలా మరికొన్ని రకాల్లో దొరుకుతాయి. ఈ మొక్కల్లో నాడీ వ్యవస్థ ఆకుల్లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. పువ్వులు చాలా చిన్నవిగా ఉంటాయి. ఇవి ఆరుబయట, నీడ లోనూ రెండు చోట్లా పెరగగలవు. 

పీస్ లిల్లీ(Peace lilly)

పీస్ లిల్లీస్ అనే ఈ పూలు అమెరికా, ఆసియా ఖండాల్లోని దేశాల్లో కనిపిస్తాయి. ఇందులో 47 రకాల జాతులున్నాయి. ఇవి వర్షాకాలంలోనూ, అధిక తేమ ఉన్న ప్రదేశాల్లోనూ పెరుగుతాయి. అందువల్ల వీటిని ఇళ్లలో పెంచుకోవడానికి ఇష్టపడతారు. వీటికి కాంతి, నీరు పెద్దగా అవసరం లేదు. ఇవి ప్రత్యేకమైన పువ్వులను కలిగి ఉంటాయి. ఆకులపైన పువ్వులు పూయడం వీటి ప్రత్యేకత. చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఇంటి లోపల కూడా పెరిగే సామర్థ్యం ఉండటంతో అందం కోసం వీటిని పెంచుకుంటారు. 


 

click me!