ఇంట్లోనే ఫ్రూట్ సలాడ్ చెట్టును పెంచొచ్చు.. ఎలాగంటే?

By Shivaleela Rajamoni  |  First Published Dec 16, 2023, 10:47 AM IST

ఫ్రూట్ సలాడ్ ను రెగ్యులర్ గా తినేవారున్నారు. అయితే ఫ్రూట్ సలాడ్ పండ్ల కోసం మీరు మార్కెట్ వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఇంట్లోనే ఈ చెట్టును చాలా ఈజీగా పెంచొచ్చు తెలుసా? అవును ఒకే చెట్టుకు వేర్వేరు పండ్లను పండించొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


గ్రాఫ్టెడ్ పూల మొక్కలను ఇదివరకు మీరు చూసే ఉంటారు. ఈ మొక్కలకు ఎన్నో రంగుల పవ్వులు పూస్తాయి. ఇలాగే గ్రాఫ్టెడ్ పండ్ల మొక్కలను ఎప్పుడైనా చూసారా? ఒకే చెట్టుకు వివిధ రకాల పండ్లను కాస్తాయి ఈ  చెట్లు. ఆపిల్, రేగు, పీచెస్ వంటి ఎన్నో పండ్లను మనం ఒకే చెట్టుకు చూడొచ్చు. అది గ్రాఫ్టెడ్ చెట్టు ద్వారా మాత్రమే. ఈ పండ్లతో ఎంచక్కా ఫ్రూట్ సలాడ్ ను చేసుకోవచ్చు. నిజానికి ఇంట్లో ఫ్రూట్ సలాడ్ చెట్టును మీరు పెంచితే చూసే వారు ఆశ్చర్యపోతారు. ఇది కూడా సాధ్యమే అని అందరికీ తెలుస్తుంది కూడా. అయితే ఈ చెట్టు వేర్వేరు పండ్లను పండించే నిజమైన చెట్టులా నిటారుగా ఉండదు. ఇది "గ్రాఫ్టింగ్" పద్దతి కాబట్టి.. దీనిలో వివిధ పండ్ల మొక్కల కొమ్మలను కలుపుతారు.

ఇంట్లో ఫ్రూట్ సలాడ్ చెట్టును పెంచడానికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

Latest Videos

undefined

ఫ్రూట్ సలాడ్ చెట్టుకు మొక్కల ఎంపిక: ముందుగా మీరు ఒకే చెట్టుకు అంటు కట్టాలనుకుంటున్న పండ్ల మొక్కలను ఎంచుకోండి. ఈ పండ్లు పండే సమయం, వాతావరణ అవసరాలలో ఒకదానికొకటి సరిపోలాలి. ఉదాహరణకు.. మీరు మామిడి, ద్రాక్షపండు, నారింజలను ఎంచుకోవచ్చు. అయితే మీరు కొనే మొక్కలు ఆరోగ్యంగా, ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలి. 

ఫ్రూట్ సలాడ్ ట్రీ కోసం ఎలా అంటుకట్టాలి

గ్రాఫ్టింగ్ చేయడానికి మీరు స్ప్లిస్ లేదా లిఫ్ట్ గ్రాఫ్ట్ వంటి ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించొచ్చు. ఇది సున్నితమైన ప్రక్రియ. అందుకే మీరు ఆన్లైన్ ట్యుటోరియల్స్ లేదా అనుభవజ్ఞుడైన వ్యక్తుల నుంచి నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మీరు ప్రయత్నించిన మొదటి సారే అది సక్సెస్ అవుతుందని అనుకోవద్దు. గ్రాఫ్టింగ్ సక్సెస్ కావాలంటే మళ్లీ ప్రయత్నించండి. దీనికి ఓపిక చాలా అవసరం. 

ఫ్రూట్ సలాడ్ చెట్టును ఎలా చూసుకోవాలి?

  • మీరు గ్రాఫ్టించ్ చేసిన  ఫ్రూట్ సలాడ్ చెట్టును సరిగ్గా చూసుకోవాలి. అంటే ఈ మొక్కకు తగినంత సూర్యరశ్మి తగలాలి. అలాగే నీటిని, పోషణను అందివ్వాలి. 
  • అన్ని పండ్లను క్రమం తప్పకుండా తెంపాలి. 
  • కొన్ని సంవత్సరాల తర్వాత మీ ఇంట్లో పెంచిన ఫ్రూట్ సలాడ్ మొక్క పండ్లతో ఫ్రూట్ సలాడ్ ను చేసుకుని తినొచ్చు. 
  • ఇది మీకు ప్రత్యేకమైన  అనుభవాన్ని కలిగిస్తుంది. 

చాలా తక్కువ స్థలంలో ఫ్రూట్ సలాడ్ ట్రీ 

  • చిన్న చిన్న తోటలు ఉన్నవారు దీన్ని ఎంచక్కా పెంచొచ్చు. ఇది మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
  • ఇది చిన్న పట్టణాలు లేదా తోటలకు అనుకూలంగా ఉంటుంది.
  • ఈ చెట్టును పెంచడం చాలా సులువు. దీనికి శ్రమ కూడా తక్కువగా ఉంటుంది. 
  • ముఖ్యంగా మీ ఇంటికి లేదా మీ తోటకు ఆకర్షణీయమైన కేంద్ర బిందువుగా మారుతుంది.
  • గ్రాఫ్టింగ్ గురించి, మొక్కల జీవశాస్త్రం గురించి తెలుసుకోవడానికి ఇదొక గొప్ప మార్గం.
  • మీరు ఈ చెట్లను కుండీలలో  కూడా పెంచొచ్చు. అందుకే తక్కువ స్థలం ఉన్నవారు కూడా ఈ చెట్టును పెంచొచ్చు. 

ఫ్రూట్ సలాడ్ చెట్టును నాటేటప్పుడు గమనించాల్సిన విషయాలు

  • ఫ్రూట్ సలాడ్ చెట్టును పెంచడానికి కాస్త సమయం పడుతుంది. అందుకే సహనంతో ఉండాలి. 
  • స్థానిక వాతావరణం, పండ్ల రకాన్ని బట్టి, కొన్ని ఫ్రూట్ సలాడ్ చెట్లు విజయవంతం కాకపోవచ్చు.
  • సేంద్రీయ, స్థిరమైన పద్ధతులను ఉపయోగించి పండ్లను పండించండి.
click me!