శృంగార ఆసక్తిని పెంచే మామిడి..?

First Published | May 29, 2023, 1:14 PM IST

మామిడి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ.. మామిడి తినే పద్దతిలో తింటేనే ఆ ప్రయోజనాలు అందుతాయట. లేదంటే ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
 

పండ్లలో రారాజు మామిడి. నిగనిగలాడే మామిడి పండును చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే. చాలా మంది కేవలం ఈ మామిడి పండ్ల కోసమే వేసవి కాలం కోసం ఎదురు చూస్తారు అనడంలో ఎలాంటి అతిశయెక్తి లేదు. వేసవి పోతే, మళ్లీ తిందామన్నా మామిడి పండు కనపడదు. రుచి మాత్రమే కాదు, మామిడి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ.. మామిడి తినే పద్దతిలో తింటేనే ఆ ప్రయోజనాలు అందుతాయట. లేదంటే ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
 

మామిడి పండ్లపై ఒకరకం ఫ్లైటిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మానికి తగిలితే అలర్జీలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. దాని వల్ల ముఖంపై దురద లాంటివి రావచ్చు. లేదంటే ర్యాషెస్ లాంటివి కూడా రావచ్చు. అందుకే.. మామిడి పండును చూడగానే తినాలనే మనసు ఎంతగా పరితపించినా వెంటనే తినేయకూడదు. కాసేపు ఆగాల్సిందే.
 


Image: Getty

కాసేపు నీటిలో ఉంచి, ఆ తర్వాత పండును తినాలి. ఇలా చేయడం వల్ల మామిడిపై ఉన్న యాసిడ్ ని తొలగించడంతో పాటు, ఆ పండు తిన్నా వేడి చేయకుండా ఉంటుంది.
 

mango

ఇక ఆయుర్వేదం ప్రకారం భోజనంతో పాటు పండ్లను అస్సలు తినకూడదు. కానీ మామిడి పండ్లు మాత్రం అలా చేయకూడదు. వీటిని పాలతో కలిపి తీసుకుంటే మంచి బలంగా తయారౌతారు. అంతేకాదు, ఇలా చేయడం వల్ల శృంగారం మీద ఆసక్తి  కూడా పెరుగుతుంది.

పిత్త,వాత దోషాలను కూడా తగ్గిస్తుంది. అయితే, జీర్ణ సమస్యలు..రూమటాయిడ్ ఆర్థ్రయిటిస్, సోరియాసిస్, ల్యూపస్ వంటి ఆటోఇమ్యూన్  జబ్బులు లాంటి చర్మ సమస్యలు ఉన్నవారు మాత్రమే మామిడి పండును పాలతో తీసుకోకూడదు. మిగిలినవారు హాయిగా ఈ కాంబినేషన్ ని ఎంజాయ్ చేయవచ్చు.

mango

ఇక, చాలా మంది మామిడి తొక్కతేసేసి, లోపలి గుజ్జు మాత్రమే తింటూ ఉంటారు. అలా తినడం వల్ల ఫైబర్ ని దూరం చేసినవారు అవుతారు. మామిడి తొక్కతో సహా తింటే, దీర్ఘకాల మలవిసర్జన సమస్య ఉన్నవారు సైతం ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.  

mango

మామిడిలో ఏ, సి వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని వృద్ధాప్యం నుంచి రక్షిస్తాయి. కాబట్టి, వీటిని ఆస్వాదించడం వల్ల అందం కూడా పెరుగుతుంది..

Latest Videos

click me!