BrahmaMudi 7th march Episode:స్వప్న అందాల ఆరబోత, దుగ్గిరాల ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్, అనామికకు రాజ్ చురకలు..!

First Published | Mar 7, 2024, 10:23 AM IST

నన్ను కాదు అనే హక్కు ఎవరికీ లేదని, ఈ దుఖానం మూతపడదు అని స్వప్న అంటే.. ఎలా మూతపడదో నేను చూస్తాను అని రుద్రాణి లోపలికి వెళ్లి అందరినీ పిలుస్తుంది.

Brahmamudi

BrahmaMudi 7th march Episode: కావ్య వాళ్ల బావ భాస్కర్ ని స్నానానికి తీసుకొని వెళతాను అంటుంది. అయితే.. రాజ్ వద్దని.. నేను తీసుకువెళతాను అని.. భుజాలపై మోసుకొని బాత్రూమ్ కి తీసుకొని వెళతాడు. అక్కడిదాకా తీసుకొని వెళ్లిన తర్వాత కూడా.. భాస్కర్.. రాజ్ ని ఓ రేంజ్ లో ఆడుకుంటూ ఉంటాడు. తనకు ఏది అవసరం వచ్చినా బుజ్జీ అని పిలవడం మొదలుపెడతాడు. ఆ మాటలకు రాజ్ కంగారుపడుతూ ఉంటాడు. ఒకసారి సబ్బు కావాలంటాడు.. మరోసారి బనియన్, డ్రాయర్ కావాలని అంటాడు. దేనికీ బుజ్జిని పలవొద్దని... అన్నీ నేనే ఇస్తాను అని రాజ్ ఇస్తాడు. ఆ సీన్ మాత్రం ఫుల్ కామెడీగా ఉంటుంది.
 

Brahmamudi

ఇక.. దుగ్గిరాల ఇంట్లో ఉదయాన్నే రుద్రాణి లేచి బయటకు వచ్చి ఆవలిస్తేంటే.. సూపర్ మేడమ్ అనే మాట వినపడుతుంది. తనను ఎవరు కామెంట్ చేసేది అని చూసే సరికి.. స్వప్న ఫోటో షూట్ కోసం పొట్టి డ్రెస్ వేసుకొని.. ఫుల్ క్లీవేజ్ తో షో చేస్తూ ఉంటుంది. అది చూసి రుద్రాణికి ఫ్యూజులు ఎగిరిపోతాయి.కరివేపాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్వప్న అంటుంది.  ఏం జరుగుతుందని రుద్రాణి అడిగితే.. మోడలింగ్ చేస్తున్నాను అని చెబుతుంది.  ఇంట్లో వాళ్లు వద్దు అన్న పని, అది కూడా ఇంట్లోనే దుకాణం పెడతావా అని రుద్రాణి సీరియస్ అవుతుంది. దానికి స్వప్న.. నీ కొడుకు కోట్లు తెస్తుంటే తిని కూర్చోలేక , టైమ్ పాస్ కోసం ఈ పని చేయడం లేదు.. ఈ ఇంట్లో మీరే అడుక్కుతింటున్నారని తెలుసని.. అందుకే నా సంపాదన నేను చూసుకుంటున్నాను అని చెబుతుంది.నన్ను కాదు అనే హక్కు ఎవరికీ లేదని, ఈ దుఖానం మూతపడదు అని స్వప్న అంటే.. ఎలా మూతపడదో నేను చూస్తాను అని రుద్రాణి లోపలికి వెళ్లి అందరినీ పిలుస్తుంది.

Latest Videos


Brahmamudi

ఇంట్లో అందరినీ పిలవడంతో అందరూ వస్తారు. వాళ్లందరినీ తీసుకొని వెళ్లి.. స్వప్న చేస్తున్నది చూపిస్తారు. అది చూసి అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ‘ ఇంటి గుట్టు, ఇంటి పరువు అని అందరికీ నీతులు చెబుతావ్ కదా.. మరి ఇప్పుడు ఇంటి గుట్టు బజారునపడుతోంది. ఇక్కడ జరిగేది ఏంటి? అందాల ప్రదర్శన కాదా? ఈ ఫోటోలు బయటకు వెళితే, దుగ్గిరాల అమ్మాయి అని తెలిస్తే.. పరువు పోదా ’ అని ధాన్యలక్ష్మి అపర్ణ పై సెటైర్ వేస్తుంది. దానికి అపర్ణ.. అత్త, మొగుడు ఏం చేస్తున్నారు.. వద్దు అని చెప్పాలి కదా అని అంటుంది. వెంటనే రాహుల్.. మమ్మీ వెళ్లి.. రెండు పీకి లాక్కొని రా అంటాడు. అయితే.. సుభాష్ అదేమీ వద్దు అని, ముందు ఆ ఫోటోషూట్ అయిపోని.. తర్వాత.. స్వప్న తో మాట్లాడదాం అని అంటాడు. దీంతో.. అందరూ ఆగిపోయి.. అలానే స్వప్న ఫోటోషూట్ ని చూస్తూ ఉంటారు.

Brahmamudi

సీన్ కట్ చేస్తే.... కనకం ఇంట్లో రాజ్ టీ తాగుతుంటే.. కావ్య తన బావకు కొసిరి కొసిరి బ్రేక్ ఫాస్ట్ తినిపించబోతుంది. అయితే.. అది జరగకుండా.. రాజ్ ఫోన్ వచ్చినట్లు డ్రామా ఆడతాడు. ఆఫీసులో ఏధో అర్జెంట్ వర్క్ వచ్చిందని.. కంగారుగా... కనీసం టిఫిన్ తిన్న చేతిని కడుక్కోనివ్వకుండా లాక్కొని వెళ్లిపోతాడు. వీళ్లుు వెళ్లేసరికి.. రాజ్ కి కావ్య ఎప్పుడు దూరం అయిపోతుందా అని కంగారు పడిపోయాడని అప్పూ, భాస్కర్ నవ్వేసుకుంటారు.

Brahmamudi

ఇక.. రాజ్, కావ్యలు తమ ఇంటి దగ్గరకు వెళ్లేసరికి స్వప్న ఫోటో షూట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఏం జరుగుతోంది అక్కడ అని రాజ్ అడిగితే.. మా అక్క మళ్లీ ఏదోప్రాబ్లం తీసుకువచ్చినట్లు ఉంది అని కంగారుగా లోపలికి వెళ్తుంది. వీళ్లు వెళ్లేసరికి స్వప్న ఫోటో షూట్ అయిపోతుంది. దీంతో.. అందరూ కలిసి  ఏం చేస్తున్నావ్ అని స్వప్నను అడుగుతూ ఉంటారు. అవసరం కోసం చేయాల్సి వచ్చింది అని చెబుతుంది. ఏంటా అవసరం అంటే డబ్బు అని చెబుతుంది.

Brahmamudi

ఈ ఇంట్లో నీకు డబ్బు కొదవా అని సీతారామయ్య షాకౌతాడు. అవును తాతయ్య.. మా అత్తను అడిగితే.. వెళ్లి నీ పుట్టింట్లో తెచ్చుకో అని అంటున్నారు అని అంటుంది. అయితే... దానికి ధాన్యలక్ష్మి సెటైర్ వేస్తుంది. ఏంటి రుద్రాణి.. వాళ్ల పుట్టిల్లే.. ఈ ఇంటి మీద పడి తింటున్నారు అని అంటుంది. దానికి కావ్యకు కోపం వస్తుంది.. చిన్న అత్తయ్య.. మా వాళ్లు ఎవరి మీదా పడి తినడం లేదని...వాళ్ల కష్టం మీద వాళ్లు బతుకుతున్నారు అని చెబుతుంది. 

దానికి వెంటనే అనామిక అందుకుంటుంది. కష్టం మీద బతికేవాళ్లు అయితే.. కళ్యాణ్  కి అప్పూని ఎవరవేసి.. డబ్బు కాజేయాలని చూడలేదా అని అంటుంది. ఆ మాటకు రాజ్ కి కోపం వస్తుంది. అనామిక అని అరుస్తాడు. ఇక్కడ లేని వాళ్ల గురించి మాట్లాడవద్దు అని అంటాడు. ఇక్కడ జరుగుతన్నది వేరు.. మీరు మాట్లాడుతున్నది వేరు అని చెబుతాడు. ఎవరి పుట్టింటికి ఎంత డబ్బు ముట్టాయి అనే విషయాలు ఇప్పుడు అప్రస్తుతుం అంటాడు. ఆ మాటకు అనామిక ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే.. వాళ్ల నాన్నకు ఆల్రెడీ రాజ్ రూ.2కోట్లు ఇస్తాడు. అది గుర్తొచ్చి నోరు మూస్తుంది.

Brahmamudi

మళ్లీ స్వప్న టాపిక్ లైన్ లోకి వస్తుంది. నీకు డబ్బు అవసరం అయితే.. ఇంట్లో మమ్మల్ని అడగొచ్చు కదా అని సుభాష్ అంటే.. మిమ్మల్ని నేను ఎలా అడుగుతాను అంకుల్ అంటుంది. స్వప్న చెప్పింది కూడా నిజమే కదా.. ఆమె భాధ్యత భర్తదే కదా అని రాజ్ కూడా అంటాడు. ఇక.. స్వప్న తన గురించి మాత్రమే కాదని.. ఈ ఇంట్లో నా అత్త, మొగుడే అడుక్కు తింటున్నారని, రేపు నా బిడ్డకు ఒక్క డ్రెస్ కూడా తెస్తారనే నమ్మకం తనకు లేదు అని చెబుతుంది. స్వప్న మాట్లాడిన దాంట్లో నిజం  ఉందని.. ఫ్యామిలీ అంతా కలిసి... రాహుల్, రుద్రాణిలను చెడమడా తిడతారు.

Brahmamudi

ఛాన్స్ దొరికందని.. నా దగ్గర డబ్బు లేదని, నా మొగుడు నాకు రూ. కోట్లు భరణంగా ఇవ్వలేదని చెబుతుంది. తన కొడుకు కి కూడా.. ఎలాంటి పని లేదని, అంటుంది. దానికి.. సుభాష్.. నా కొడుకులాగా... నీ కొడుకు కూడా బాధ్యతతో ఉంటే.. వాడికి కూడా ఏదో పని అప్పగించేవాళ్లమని.. వాడు ఇప్పటికి కూడా పనీపాట లేకుండా గాలి తిరుగుళ్లు తిరుగుతున్నారని , ముందు భార్యను పట్టించుకోమని.. ఇంట గెలిచి.. తర్వాత రచ్చ గెలవమని చెప్పు అని సుభాష్ వార్నింగ్ ఇస్తాడు.

ఇక.. ఇంటి పెద్దలంతా స్వప్నకు నచ్చచెబుతారు. నీ సమస్య మాదాకా వచ్చింది కాబట్టి.. తాతయ్య గారు ఆలోచించి ఏదో ఒకటి చేస్తారని.. అప్పటి వరకు నువ్వు ఇలాంటి పనులు చెయ్యకు అని చెబుతారు. స్వప్న సరే అంటుంది. అందరూ లోపలికి వెళతారు. నీ వల్లే ఇదంతా అని రుద్రాణి.. కొడుకు రాహుల్ ని తిడుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
 

click me!