నయనతార నటించిన 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీ 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. 2017లో విడుదలైన 'నానుమ్ రౌడీదాన్' సినిమాలోని ఒక సన్నివేశాన్ని ఈ డాక్యుమెంటరీలో వాడారు.
Also Read: అమల తల్లి ఏదేశానికి చెందిన మహిళ, అమల ఇండియన్ కాదా..?
'నానుమ్ రౌడీదాన్' సినిమాలోని సన్నివేశాన్ని అనుమతి లేకుండా వాడినందుకు దనుష్, నయనతారపై 10 కోట్ల నష్టపరిహార దావా వేశారు.
Also Read: 50 కోట్ల నుండి 300 కోట్ల వరకు : శివకార్తికేయన్ బాక్స్ ఆఫీస్ హిట్స్ !
దీనిపై నయనతార, దనుష్ ని ఘాటుగా విమర్షిస్తూ.. ఒక ప్రకటన విడుదల చేసింది. నయనతారకు మద్దతుగా ఆమె భర్త విఘ్నేష్ శివన్ కూడా నిలిచారు.
Also Read: పుష్ప 2 కోసం రష్మిక మందన్నా రెమ్యునరేషన్...? స్టార్ హీరోయిన్లు కూడా షాక్ అయ్యేలా శ్రీవల్లి పారితోషికం
నయనతారకు శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, ఐశ్వర్య రాజేష్, నజ్రియా మద్దతు తెలిపారు. నయనతార 40వ పుట్టినరోజు సందర్భంగా ఈ డాక్యుమెంటరీ విడుదలైంది.
ఈ డాక్యుమెంటరీలో నయనతార, ఆమె తల్లి, సోదరుడు, భర్తతో పాటు రాధిక, నాగార్జున, టాప్సీ, రానా, తమన్నా, విజయ్ సేతుపతి నటించారు.
ఈ డాక్యుమెంటరీకి మిశ్రమ స్పందన వచ్చింది. మొదటి భాగం బాగున్నా, రెండో భాగం అంతగా ఆకట్టుకోలేదు.
నెట్‌ఫ్లిక్స్ నయనతారకు 25 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. కానీ, 80 నుంచి 100 కోట్ల వరకు తీసుకున్నారని నెటిజన్లు అంటున్నారు.
అయితే, అధికారికంగా మాత్రం ఎంత తీసుకున్నారుఅనేదానిపై క్లారిటీ లేదు. అయితే 20 నుంచి 30 కోట్ల వరకు తీసుకుని ఉండొచ్చని అంచనా.
Mahesh Jujjuri