అందులో భాగంగా ఈ టీజర్ కోసం నట సింహం నందమూరి బాలయ్యను వాడేయాలని చూస్తున్నాట టీమ్. టీజర్ లో బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్ ను ఆడ్ చేయాలని ఆలోచన. అయితే ఈ విషయం మూవీ టీమ్ అఫీషియల్ గా చెప్పలేదు కాని సోషల్ మీడియాల మాత్రం వార్త వైరల్ అవుతోంది. టీజర్ కే బాలయ్య ను ట్రై చేస్తున్నారంటే.. సినిమా రిలీజ్ వరకూ ఎంత మంది స్టార్లు ఈ సినిమా కోసం పనిచేస్తారో చూడాలి.
అంతే కాదు ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలనిప్రయత్నం చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈసారి టార్గెట్ కొట్టకపోతే హీరోగా మరుగున పడిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే ఎన్ని ప్లాప్ లు వచ్చినా.. తన యాటిట్యూడ్ తో ఇమేజ్ డౌన్ అవ్వకుండా ఫ్యాన్స్ ను హోల్డ్ చేసుకోగలుగుతున్నాడు విజయ్. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి మరి.