500 ఏళ్లలో మగజాతి అంతరించిపోతుందా? సీనియర్‌ నటుడు చెప్పిన పచ్చినిజాలు, నిద్ర లేవకపోతే ఇక అంతే

First Published | Nov 20, 2024, 6:31 PM IST

పవిత్ర లోకేష్‌తో సహజీవనం చేస్తూ ఆ మధ్య పెళ్లికి సంబంధించిన వివాదాల్లో నిలిచిన నరేష్‌ తాజాగా సంచలన నిజాలు చెప్పాడు. మగజాతి అంతరించిపోతుందంటూ షాకిచ్చాడు. 
 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది. దాన్ని ప్రపంచం అంతా సెలబ్రేట్‌ చేసుకుంటుంది. కానీ ఆడవారికి లాగే మగవారికి కూడా అంతర్జాతీయ మెన్స్ డే ఉంది. నవంబర్‌ 19న అంతర్జాతీయ మెన్స్ డే గా ప్రకటించారు. కానీ దాన్ని ఎవరూ ఇంప్లిమెంట్‌ చేయడం లేదు. సెలబ్రేట్‌ చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నటుడు నరేష్‌ ముందుకు వచ్చాడు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
 

Naresh

మ్యారేజ్‌ విషయాల్లో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సీనియర్‌ నటుడు వీకే నరేష్‌ తాజాగా అంతర్జాతీయ మెన్స్ డేని సెలబ్రేట్‌ చేశాడు. రవిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. ఈ మూవీ సెట్‌లోనే ఆయన టీమ్‌తో కలిసి ఈ మెన్స్ డేని సెలబ్రేట్ చేశారు. కేక్ కట్‌ చేయించారు. మగజాతి మేల్కోవాలని, ఇకనైనా కళ్లు తెరవాలని తెలిపారు నరేష్‌. ఈ క్రమంలో ఆయన షాకింగ్‌ విషయాలు బయటపెట్టారు. 
 


మగజాతి ముప్పు ఉందని తెలిపారు. ఆడవారిపై అత్యాచారాలు పెరిగినట్టుగానే మగవారిపై కూడా డొమెస్టిక్‌ వాయిలెన్స్ జరుగుతుందని, కొందరు ఆడవాళ్లు మగవాళ్లపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, ఆడవాళ్లు, మగవాళ్లు కలిసి కట్టుగా ఉండాలని, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వాలని, ప్రేమని పంచుకోవాలని, అన్ని విషయాల్లో కలిసిమెలిసి తోడుగా ఉండాలని తెలిపారు నరేష్‌. 
 

ఈ క్రమంలో ఓ షాకింగ్‌ విషయాన్ని చెప్పాడు నరేష్. మగజాతి అంతరించిపోతుందన్నారు. వైద్య పరిశోధనల్లో తేలిన విషయం బయటపెట్టారు. మగవాళ్లలో వై క్రోమో జోమ్‌ నశించిపోతుందని, క్రమంగా ఇది తగ్గిపోతుందని, దీంతో ఎక్కువగా ఆడవాళ్లే జన్మిస్తారని, రానున్న ఐదు వందలు, వెయ్యి సంవత్సరాలలో మగవాళ్లు బాగా తగ్గిపోతారని, ఇది మగజాతి అంతరించే పరిస్థితికి దారితీస్తుందని తెలిపారు నరేష్‌. కాబట్టి మగవాళ్లు మేల్కోవాలని, ఒత్తిడిలు తగ్గించుకోవాలని, డ్రగ్స్, స్మోకింగ్‌ వంటి చెడు అలవాట్లకి దూరంగా ఉండాలన్నారు. 

also read: బాలకృష్ణకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా? ఆయన ఒక్కరినే కలుస్తాడా? విశ్వక్‌ సేన్‌, సిద్దు కాదు

అదే సమయంలో సేఫ్‌ సెక్స్ కి ప్రయారిటీ ఇవ్వాలని, కండోమ్‌లో వాడాలని తెలిపారు. మెన్స్ డేని ఇండియాలో జరుపుకోవడం లేదని, దీనిపై అవగాహన లేదని, ఇకపై అయినా కళ్లు తెరవండి మగవాళ్లారా అని పిలుపునిచ్చారు నరేష్‌. నరేష్‌ ఆ మధ్య పవిత్ర లోకేష్‌తో పెళ్లికి సంబంధించిన వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

తన మూడో భార్యకి విడాకుల అనంతరం ఆయన నటి పవిత్ర లోకేష్‌తో సహజీవనం చేస్తున్నాడు. అయితే దీన్ని మూడో భార్య రమ్యరఘుపతి అభ్యంతరం తెలిపింది. అడ్డుకుంది. దీంతో పెద్ద వివాదం అయ్యింది. అయితే ఈ వివాదం సర్దుమనిగింది. ఇప్పుడు కూల్‌గా పవిత్రలోకేష్‌తో ఉంటున్నారు నరేష్. అదే సమయంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. 

read more:ఖాళీగా ఉందని అమ్మాయిని ప్రేమించిన చిరంజీవి డైరెక్టర్‌, ఇన్‌ కమింగ్‌ కాల్‌ ఫ్రీ చేయాలంటూ దేవుడికి మొక్కులు

Latest Videos

click me!