బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మణికంఠను అందరూ టార్గెట్ చేస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను అడ్డుకునే ప్రయత్నంలో శక్తి టీమ్ విజయం సాధించింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో తాజా ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగాసాగింది. అయితే అందరు కావాలని చేస్తున్నారా..? లేక వేరే అభిప్రాయం ఉందా తెలియదు కాని.. అంతా మణికంఠను టార్గెట్ చేస్తున్నారు.
ఈ వీక్ ఎలాగైనా మణింకఠను బయటకు పంపించాలని విశ్వప్రయత్నంచేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ లో దాదాపు అందరు. మరీ ముఖ్యంగా యష్మీ అయితే.. మణింకఠను బయటు వెళ్తే బాగుండు అని డైరెక్ట్ గానే ప్రేరణాతో అన్నది యష్మి. ఇక నైనిక కూడా మణికంఠ మీద కోపంగానే ఉంది. ఛాన్స్ వస్తే.. మణికంఠను సైడ్ చేయాలని చూస్తోంది.
ఈక్రమంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సబంధించి మరో అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీని అడ్డుకోవడం కోసం మరో మూడు టాస్క్ లను పెట్టాడు. ఈ మూడు టాస్క్ లలో శక్తీ టీమ్ విన్ అయ్యారు. ఈ మూడు టాస్క్ లను విష్ణుప్రియ నిఖిల్, నబిల్ - ఆధిత్య , మణికంఠ - యష్మి పోటా పోటీగా ఆడారు. కాని కాంతార టీమ్ ఒక్క టాస్క్ లో కూడా విన్ అవ్వలేదు.
ఈక్రమంలో కాంతార టీమ్ లో లుకలుకలు మొదలయ్యాయి. ఇక రెండు టాస్క్ లద్వారా ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపగలిగారు శక్తి టీమ్. అంతే కాదు ప్రైజ్ మనీని కూడా పెంచారు. ఇక హౌస్ అంతా తనను ట కార్నర్ చేస్తుండటంతో.. మణికంఠ తన బాధను ఒంటరిగా బిగ్ బాస్ కు చెప్పుకుంటున్నాడు.
అంతే కాదు మణికంఠనుఇలా టార్గెట్ చేసి.. కార్నర్ చేయడం వల్ల అతనికి ఆడియన్స్ లో సింపతి పెరగడంతో పాటు.. ఓటింగ్ కూడా భారీగాపోల్ అవుతోంది. నిజానికి హౌస్ లో మణికంఠ కంటే తక్కువగా ఆడేవారు చాలామంది ఉన్నారు. ప్రేరణలాంటివారు అసలు ఆటకుముందుకు రావడంలేదు.
నైనిక ఫస్ట్ వీక్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉందో.. ఆతరువాత నుంచి వీక్ అవుతూ వస్తోంది. గేమ్ స్పిరిట్ ఆమెలో కనిపించడంలేదు. ఇక విష్ణు ప్రియ ఈసారి గట్టిగా ట్రై చేసి. ఆటతీరును మెరుగుపరుచుకుంది. ఇక నబిల్ మాత్రం ఈసారి గేమ్ లో ఆటతీరును పెంచుకోలేకపోయాడు.
ఇక ఫైనల్ గా మూడు టాస్క్ లలో ఒక టాస్క్ ను రెండు టీమ్ లు చేయలేకపోయాయి. దాంతో హౌస్ లోకి రావడానికి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఛాన్స్ ఇచ్చిటన్టు అయ్యింది. ఇక తరువాత రెండు టాస్క్ లు గెలవడంతో.. ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపగలిగారు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎప్పుడు ఉంటాయోతెలియక అయోమయంలో ఉన్నారు కంటెస్టెంట్స్.
ఇక ఈ వారం మిడ్ వీక్ లో ఒక ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ముందే చెప్పారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి నాగ్ చెప్పకపోయినా.. ఈ వీక్ లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా ఈ శనివారమే ఉంటుందన్న సంకేతాలు ఉన్నారు.
అంతే కాదు హౌస్ నుంచి ఎలిమినేట్అయ్యేది ఎవరు అనే విషయంలో కూడా చాలా ఉక్కంఠ ఉంది. నైనిక వెళ్ళిపోవచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. అంతే కాదు మణికంఠ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలస్తోంది.