50 కోట్ల నుండి 300 కోట్ల వరకు : శివకార్తికేయన్ బాక్స్ ఆఫీస్ హిట్స్ !

First Published | Nov 20, 2024, 5:40 PM IST

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన  అమరన్  సినిమా  దీపావళి సందర్భంగా రిలీజ్ అయ్యి..  300 కోట్ల రూపాయల వసూళ్లను దాటి పరుగులు తీస్తోంది. 

శివ కార్తికేయన్

బుల్లితెరపై తన ప్రస్థానాన్ని ప్రారంభించి..రియాల్టీ షోలకు హోస్ట్ గా వ్యవహరించి.. వెండితెరపై అడుగు పెట్టాడు శివ కార్తికేయన్. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ, హాస్యనటుడిగా మారి, ఇప్పుడు యాక్షన్ హీరోగా ఎదిగారు. తక్కువ వసూళ్లతో మొదలై ఇప్పుడు 300 కోట్ల వసూళ్లు రాబట్టే స్టార్ హీరోగా మారారు.

మాన్ కరాటే

2014లో దర్శకుడు తిరుమురుగన్ దర్శకత్వంలో, అనిరుధ్ సంగీతంలో వచ్చిన "మాన్ కరాటే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు శివకార్తికేయన్. ఈ  చిత్రంలో హన్సిక, సతీష్, షాజీ షెన్, వంశీ కృష్ణ తదితరులు నటించారు. శివ కార్తికేయన్  కెరీర్‌లో మొదటి 50 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రం ఇది. అదే ఏడాది "రోమియో" సినిమా 75 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు.

Latest Videos


డాక్టర్

2021లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన "డాక్టర్" చిత్రం మంచి విజయాన్ని సాధించింది. శివ కార్తికేయన్ కెరీర్‌లో మొదటి 100 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రం "డాక్టర్". 2022లో సిబి చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన "డాన్" చిత్రంలో ప్రియాంక మోహన్, ఎస్.జె. సూర్య, సముద్రఖని, సూరి తదితరులు నటించారు. ఈ సినిమా 125 కోట్లు వసూలు చేసింది.

అమరన్

ఇలా అద్భుతమైన సినిమాలు చేసుకుంటూ ఎప్పటికప్పుడు గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తోన్న శివ కార్తికేయన్  ఈ ఏడాది దీపావళికి "అమరన్" సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో, కమల్ హాసన్ నిర్మాణంలో ఈ చిత్రం విడుదలైంది. దీపావళికి విడుదలైన నాలుగు చిత్రాల్లో "అమరన్" మంచి విజయం సాధించింది. ఇది ఆయన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 300 కోట్లను దాటి  పరుగులు పెడుతోంది. 

click me!