ఇక ప్రేమించుకున్న కొంత కాలానికే వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి వరకూ సినిమాల కోసం బాలీవుడ్ నుంచి సౌత్ కు ట్రావెల్ చేస్తూ వస్తున్న అమల.. పెళ్ళి తరువాత హైదరాబాదుకు మకాం మార్చేశారు. అంతే కాదు వివాహం తర్వాత అమల సినిమాలకు కూడా పూర్తిగా దూరమయ్యారు. అఖిల్ పుట్టడం.. ఆతరువాత ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆమె సినిమాలకు దూరంఅయ్యారు.
అఖిల్ కాస్త పెద్దవాడు అయిన తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన అమల.. చిన్న చిన్న పాత్రలకే పరిమితం అయ్యారు. ఎక్కువగా తల్లి పాత్రలు చేస్తున్నారు అమల. చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్నారు. అయితే అమల బ్లూ క్రాస్ రన్ చేస్తున్న సంగతి తెలిసిందే కుక్కలు కాని.. ఇతర ప్రాణులకు హని కలగకుండా చూసుకుంటుంటుంది.