నేనేం పాపం చేశాను, తల్లి ముందు కొడుకు వినకూడని బూతులు... వివాదంపై ఓపెన్ అయిన అమర్ దీప్!

First Published Jan 11, 2024, 3:19 PM IST

బిగ్ బాస్ సీజన్ 7 ఎంత సక్సెస్ అయ్యిందే అంతే వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది. షో ముగిసిన రోజు రాత్రి అల్లర్లు చోటు  చేసుకున్నాయి. ముఖ్యంగా అమర్ దీప్ కారుపై దాడి జరిగింది. ఆ రోజు జరిగిన ఘటనపై అమర్ దీప్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు. 
 

Amar Deep

అమర్ దీప్ మాట్లాడుతూ... హౌస్ నుండి బయటకు రాగానే నా ఫ్రెండ్స్ దాక్కో అన్నారు. అలా ఎందుకు అన్నారో? బయట ఏం జరుగుతుందో? నాకు అర్థం కాలేదు. నేనేం తప్పు చేశాను. ఎందుకు దాక్కోవాలి అన్నాను. నా కారును కొందరు చుట్టుముట్టారు. సెల్ లైట్స్ తో నన్ను వెతికారు. కనిపించిన వెంటనే తిట్టడం ప్రారంభించారు. 
 

PIc Credit: Tejaswini Gowd Youtube Channel 

Amar Deep

రాళ్లతో కార్ల అద్దాలు పగలగొట్టారు. ఆ బూతులు తల్లి పక్కన ఉండగా వినలేనివి. వాళ్ళ కోపం నా మీదే కదా, నేను బయటకు దిగబోయాను. ఆ బూతులు వినడం కంటే నాలుగు దెబ్బలు తిన్నా పర్లేదని డిసైడ్ అయ్యాను. మా అమ్మ నన్ను ఆపింది. కొందరైతే నా భార్య తేజును తీసుకెళతాం... అని బెదిరించారు.

PIc Credit: Tejaswini Gowd Youtube Channel 

Latest Videos


Amar Deep

అలాంటి మాటలు మిమ్మల్ని ఎవరైనా అంటే తట్టుకోలగరా? రియాక్ట్ కాకుండా ఉంటారా? వాళ్ళ మీద నేను కేసులు పెట్టగలను. కానీ అలా చేయలేదు. వాళ్ళకు కూడా అమ్మానాన్నలు ఉంటారు. భవిష్యత్ నాశనం అవుతుందని నేను కేసులు పెట్టలేదు. అయినా నేను ఏం పాపం చేశాను. అదంతా ఒక గేమ్.

PIc Credit: Tejaswini Gowd Youtube Channel 

Amar Deep


కొందరు హౌస్లో నన్ను తిట్టినా వయసులో పెద్దవాళ్ళని భరించాను. నేను కూడా సాధారణ కుటుంబం నుండి వచ్చినవాణ్ణే. మా నాన్న ఒక ఆర్టీసీ ఉద్యోగి. మెకానిక్ గా చేస్తారు. సినిమాపై ప్రేమతో నటుడు కావాలని చిత్ర పరిశ్రమకు వచ్చాను. మా అమ్మ బీజేపీ మహిళా మోర్చా సభ్యురాలు... అని చెప్పుకొచ్చాడు. 
 

PIc Credit: Tejaswini Gowd Youtube Channel 

Amar Deep

బిగ్ బాస్ హౌస్ పల్లవి ప్రశాంత్-అమర్ దీప్ మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్ పై కక్ష పెంచుకున్నారు. డిసెంబర్ 17న ఫైనల్ ముగిసింది. అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీగా చేరుకున్న పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్ కారుపై దాడి చేశారు.

PIc Credit: Tejaswini Gowd Youtube Channel 

టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పోలీసుల సూచనలు పాటించకుండా ర్యాలీ చేశాడు. అల్లర్లు చోటు చేసుకోగా పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ నాశనం అయ్యింది. ఈ అల్లర్ల కేసులో పల్లవి ప్రశాంత్, అతని తమ్ముడు అరెస్ట్ అయ్యాడు. మరికొందరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు...

click me!