ఇక విష్ణు ప్రియ, సోనియా వివాదంలో విష్ణు ప్రియకే ఎక్కువ క్లాస్ పీకారు నాగార్జున. సోనియాకు కూడా కాస్త చెపుతారేమో అనుకుంటే ఆమెను ఏమి అనలేదు. ఎందుకుంటే మొదటి నుంచి హౌస్ లో ఫైర్ అవుతూ వచ్చింది సోనియా. కాని ఆమెను కనీసం వార్న్ చేయలేదు కాకపోగా.. ఆమెను ఎలిమినేషన్స్ నుంచి ఫస్ట్ సేవ్ చేశారు.
ఇలా ఒక్కొక్క చిక్కు విప్పుతూ వచ్చిన నాగార్జున.. హౌస్ మెంట్స్ కు స్వీట్స్ ఇచ్చి వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ఇక నామినేషన్స్ లో 6 ఉండగా.. అందులో ఫస్ట్ సోనియాను సేవ్ చేశారు. ఇక నామినేషన్స్ లో 5 ఉండగా.. ఎవరి బిగ్ బాస్ ను వీడి వెళ్ళబోతున్నారో తరువాత ఎపిసోడ్ లో చెప్పబోతున్నారు. సమాచారంప్రకారం బేబక్క హౌస్ నుంచి వెళ్ళిపోబోతున్నట్టు తెలుస్తోంది.