Bigg Boss Telugu 8: హౌస్లోకి మాజీ కంటెస్టెంట్స్.. మొత్తం 8 మంది, వారు ఎవరంటే? 

Published : Aug 28, 2024, 06:12 PM IST
 Bigg Boss Telugu 8: హౌస్లోకి మాజీ కంటెస్టెంట్స్.. మొత్తం 8 మంది, వారు ఎవరంటే? 

సారాంశం

బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ కి సమయం దగ్గరపడుతుండగా ఒక్కో క్రేజీ న్యూస్ తెరపైకి వస్తుంది. కాగా ఈసారి మాజీ కంటెస్టెంట్స్ సైతం ఎంట్రీ ఇవ్వనున్నారట.   

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ ని పరిచయం చేయనున్నాడు. ఇక హౌస్లోకి వెళ్ళేది వీరే అంటూ అనేక మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో నిజంగా ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు అనేది సస్పెన్స్. 

బిగ్ బాస్ నిబంధనల ప్రకారం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ముగిసే వరకు కంటెస్టెంట్స్ పేర్లు బయటకు రాకూడదు. ఫస్ట్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా పరిచయం చేస్తాడు. అయితే అధికారిక ప్రకటనకు ముందే కంటెస్టెంట్స్ పేర్లు లీక్ అవుతున్నాయి. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. యాదమ్మ రాజు, జబర్దస్త్ కమెడియన్ పవిత్ర, నటుడు ఆదిత్య ఓం, నటి సన, సీరియల్ హీరోయిన్స్ తేజస్విని గౌడ, యాష్మి గౌడ అలాగే ఇంద్రనీల్, నిఖిల్ ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట. 

బెజవాడ బేబక్క, అంజలి పవన్, యాంకర్ సీత, సింగర్ సాకేత్, బంచిక్ బబ్లు తో పాటు పలువురి పేర్లు బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో వినిపిస్తున్నాయి. అనూహ్యంగా మాజీ కంటెస్టెంట్స్ సైతం ఎంట్రీ ఇస్తున్నారు అనేది తాజా న్యూస్. గత ఎనిమిది సీజన్స్లో(బిగ్ బాస్ ఓటీటీ కూడా కలుపుకుని) పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్ నుండి కొందరు బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయనున్నారట. 

శోభా శెట్టి, హరితేజ, యాంకర్ శివ, పునర్నవి మరోసారి బిగ్ బాస్ హౌస్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియదు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ వరకు ఆగాల్సిందే. ఇక వరుసగా ఆరోసారి నాగార్జున బిగ్ బాస్ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సీజన్ 3 నుండి నాగార్జున కొనసాగుతున్నారు. ఆయన సారథ్యంలో బిగ్ బాస్ తెలుగు సక్సెస్ఫుల్ గా సాగిపోతుంది. 

2017లో బిగ్ బాస్ తెలుగులో ఆరంభమైంది. ఫస్ట్ సీజన్ కి హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు. తనదైన శైలిలో హోస్టింగ్ చేసి సీజన్ 1 సక్సెస్ చేశాడు. నటుడిగా బిజీ అయిన ఎన్టీఆర్ బిగ్ బాస్ నుండి తప్పుకున్నాడు. సీజన్ కి నాని హోస్టింగ్ చేశాడు. అతడి హోస్టింగ్ కి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. దాంతో నాని తప్పుకున్నాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu: ప్రభావతితో మీనా ఛాలెంజ్, సంజూని వణికించిన పూలగంప
Karthika Deepam 2 Today Episode:దీప‌ అనాథ కాదన్న దశరథ-షాక్ అయిన జ్యో-దశరథ ఎమోషనల్-జ్యో డౌట్ క్లియర్?