Bigg Boss Telugu 8: బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా ఊహించని మాజీ కంటెస్టెంట్... ప్రేక్షకులకు ఫుల్ కిక్ గ్యారంటీ!

బిగ్ బాస్ సీజన్ 8కి రంగం సిద్ధం అవుతుంది. హోస్టింగ్ బాధ్యతలు నాగార్జున తీసుకున్నారు. కాగా బిగ్ బాస్ బజ్ హోస్ట్  పై ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. 
 


బుల్లితెరపై బిగ్ బాస్ సందడికి సమయం ఆసన్నమైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. వరుసగా 6వ సారి నాగార్జున బిగ్ బాస్ రియాలిటీ షో హోస్టింగ్ బాధ్యతలు తీసుకున్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక సైతం పూర్తి అయ్యింది. తేజస్విని గౌడ, యాష్మి గౌడ, యాదమ్మ రాజు, జబర్దస్త్ పవిత్ర, సీరియల్ నటి అంజలి పవన్, నటుడు ఆదిత్య ఓం, బంచిక్ బబ్లు, సింగర్ సాకేత్, నటి సన, సౌమ్యరావు, ఇంద్రనీల్ ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. 

ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు బిగ్ బాస్ సీజన్ 8 సరికొత్తగా రూపొందించారట. ఈసారి ఎంటర్టైన్మెంట్, ఫన్, ట్విస్ట్స్ కి లిమిటే లేదు అంటున్నాడు నాగార్జున. అలాగే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రోమో ద్వారా కంటెస్టెంట్స్ ని హెచ్చరించాడు. కాగా స్టార్ మా ప్రతి సీజన్ కి అనుబంధంగా బిగ్ బాస్ బజ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

Latest Videos

ప్రతివారం ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ బజ్ లో ఇంటర్వ్యూ చేస్తారు. ఈ బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా గత సీజన్ కంటెస్టెంట్ ని ఎంపిక చేయడం ఆనవాయితీగా ఉంది. సీజన్ 6లో కంటెస్ట్ చేసిన  గీతూ రాయల్ సీజన్ 7 బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా వ్యవహరించింది. ముక్కుసూటి ప్రశ్నలతో కంటెస్టెంట్స్ ని గీతూ రాయల్ తికమక పెట్టింది. ఆమె హోస్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. మరి సీజన్ 8 బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఎవరనే చర్చ మొదలైంది. 

మొదట శివాజీ పేరు వినిపించింది. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే శివాజీ బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా బెస్ట్ ఛాయిస్ అని స్టార్ మా భావించిందట. అయితే ఆయన నటుడిగా బిజీ అయ్యారు. సినిమాలు, సిరీస్లకు సైన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో స్టార్ మా ఆఫర్ శివాజీ తిరస్కరించాడని సమాచారం. ఇక నెక్స్ట్ బెస్ట్ అంబటి అర్జున్ అని మేకర్స్ భావిస్తున్నారట. సీజన్ 7లో ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు అంబటి అర్జున్. 

స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరాడు. అంబటి అర్జున్ చాలా ఖచ్చితంగా ఉండేవాడు. నాగార్జున సైతం కొన్ని విషయాలు, వివాదాల్లో అర్జున్ అంబటి ఒపీనియన్ అడిగేవాడు. వైల్డ్ కార్డ్ ద్వారా రావడం అంబటి అర్జున్ కి మైనస్ అయ్యింది. లేదంటే టైటిల్ రేసులో ఉండేవాడు. అంబటి అర్జున్ పై బిగ్ బాస్ మేకర్స్ కి గట్టి విశ్వాసం ఉంది. దీంతో బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా అంబటి అర్జున్ ని ఎంపిక చేశారంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి... 

click me!