బిగ్ బాస్ రివ్యూవర్ కి సీరియల్ నటుడు ఇంద్రనీల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆమె తన కుటుంబం పై దుష్ప్రచారం చేసిందని ఇంద్రనీల్ ఫైర్ అయ్యాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఇంద్రనీల్ కంటెస్ట్ చేస్తున్నాడని గట్టిగా ప్రచారం జరిగింది. తాజాగా ఇంటర్వ్యూలో దీనిపై ఇంద్రనీల్ క్లారిటీ ఇచ్చాడు. అలాగే తనపై దుష్ప్రచారం చేసిన బిగ్ బాస్ రివ్యూవర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు..
బిగ్ బాస్ మొదలైందంటే బిగ్ బాస్ రివ్యూవర్స్ కి పండగే. యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియా ప్లేట్ ఫార్మ్స్ ద్వారా వాళ్ళు లక్షల్లో సంపాదిస్తారు. షో మొదలు కాకుండానే వీరు తమ రివ్యూలు మొదలుపెడతారు. కంటెస్టెంట్స్ ఎవరు? షో ఎలా ఉండబోతుంది? నయా సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అనే అంచనాలతో కూడిన వీడియోలు చేస్తారు. ఇక షో స్టార్ట్ అయ్యాక హౌస్లో కంటెస్టెంట్స్ ప్రవర్తన ఎలా ఉంది? ఎవరు గుడ్? ఎవరు బ్యాడ్? నెక్స్ట్ వీక్ ఏలిమినేట్ అయ్యేది ఎవరని అంచనాలు వేస్తారు.
ఈ బిగ్ బాస్ రివ్యూవర్స్ ని జనాలు గట్టిగా ఫాలో అవుతారు. బిగ్ బాస్ లవర్స్ క్రమం తప్పకుండా వారి వీడియోలు చూస్తారు. ఫేమస్ బిగ్ బాస్ రివ్యూవర్స్ లో స్పై అక్క ఒకరు. చాలా కాలంగా స్పై అక్క బిగ్ బాస్ రివ్యూ వీడియోలు చేస్తుంది. ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ ఎక్స్ లో కూడా ఆమె కామెంట్స్ పోస్ట్ చేస్తుంది. ఇటీవల స్పై అక్క సీరియల్ నటుడు ఇంద్రనీల్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఇంద్రనీల్ కి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. కానీ తన భార్య మేఘన వద్దని చెప్పిందని మానుకున్నాడు. బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి లేదని ఇంద్రనీల్ కి భార్య హుకుం జారీ చేసిందంటూ వెల్లడించింది. ఆమె కామెంట్స్ ఆధారంగా ఇంద్రనీల్ పై వరుస కథనాలు వెలువడ్డాయి. తాజా ఇంటర్వ్యూలో ఇంద్రనీల్ స్పై అక్క కామెంట్స్ పై స్పందించాడు.
ఒక వ్యక్తి ఏదో మా ఇంటికి వచ్చి మాతో మాట్లాడినట్లు, మేము ఆమెకు స్వయంగా చెప్పినట్లు రివ్యూలు ఇస్తుంది. ఆమె ఎవరో చెప్పాలని కూడా నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నేను ఆ వ్యక్తిని ఎందుకు ప్రమోట్ చేయాలి?. మా సన్నిహితులు ఆమె మమ్మల్ని ఉద్దేశించి చేసిన వీడియోను పంపారు. ఆమె మాటలు విని నేను నవ్వుకున్నాను.
అసలు మాకు లేని బాధ మీకెందుకు. మా పేర్లు చెప్పి క్యాష్ చేసుకోవడం ఎందుకు? మంచి కంటెంట్ ఇచ్చి డబ్బులు సంపాదించండి. నా భార్య ఎప్పుడూ అది చెయ్ ఇది చెయ్ అని చెప్పదు. నా కెరీర్ గురించి నిర్ణయాలు నేనే తీసుకుంటాను, అని ఇంద్రనీల్ అన్నాడు. బిగ్ బాస్ షోకి వెళ్లకపోవడానికి తన భార్య ఏ మాత్రం కారణం కాదని ఇంద్రనీల్ పరోక్షంగా తెలియజేశాడు. ఇదే ఇంటర్వ్యూలో ఇంద్రనీల్ తనకు ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేశానని వెల్లడించాడు.
బిగ్ బాస్ నిర్వాహకులు తనను సంప్రదించిన మాట వాస్తవమే... కానీ నేను వెళ్లడం లేదని ఆయన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. ఇంద్రనీల్ మాట్లాడుతూ... నేను అభిమానులకు చెప్పేది ఏమిటంటే నేను బిగ్ బాస్ షోకి రావడం లేదు. బిగ్ బాస్ నిర్వాహకులు నాకు కాల్ చేశారు. అప్పుడు నా భార్య కూడా పక్కనే ఉంది. నాకు ఆసక్తి లేదని వాళ్లతో చెప్పాను. కానీ ఒకసారి ఇంటర్వ్యూకి హాజరు అవ్వండి అన్నారు.
ఇంటర్వ్యూ కి వెళ్ళాను. మరో ఇంటర్వ్యూకి రమన్నారు. అప్పుడు కూడా వెళ్ళాను. ఈసారి ముంబై వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. సెకండ్ ఇంటర్వ్యూ తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్లాలనే ఆసక్తి నాకు కలిగింది. మొదటి ఇంటర్వ్యూలో వాళ్ళు విచిత్రమైన ప్రశ్నలు అడిగారు. షోకి కావలసిన కంటెంట్ కోసం ఏవేవో అడిగారు. బిగ్ బాస్ షో అప్ కమింగ్ ఆర్టిస్ట్స్ కి, షోకి వెళ్లాలని ఆసక్తి ఉన్నవారికి హెల్ప్ కావచ్చు. నాకున్న ఇమేజ్ కి బిగ్ బాస్ సెట్ కాదు.
షోకి వెళ్ళాక గొడవలు పడాలి. నామినేషన్స్ లో గట్టిగా అరవాలి. ఇవన్నీ తలచుకుని బిగ్ బాస్ షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. నేనేదో పెద్ద ఆర్టిస్ట్ అని కాదు. బిగ్ బాస్ షోకి వెళ్ళాక మనకు ఎలాంటి ఇమేజ్ వస్తుందో చెప్పలేం, అని అన్నాడు. దాంతో ఇంద్రనీల్ బిగ్ బాస్ షోకి వెళ్లడం లేదని పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇంద్రనీల్ భార్య మేఘన అడ్డుకున్నారని కూడా ఓ వాదన గతంలో తెరపైకి రావడం విశేషం..
సెప్టెంబర్ 1న బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. వరుసగా ఆరోసారి నాగార్జున హోస్టింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు ఈసారి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నారని సమాచారం. సీజన్ 1కి ఎన్టీఆర్, సీజన్ 2కి నాని హోస్ట్స్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే..