`రాఖీ` సినిమా చేయడానికి అసలు ఉద్దేశ్యం బయటపెట్టిన ఎన్టీఆర్‌.. మగాళ్లు గుర్తు పెట్టుకోవాల్సిందే

ఎన్టీఆర్‌ `దేవర` చిత్రంతో త్వరలో రాబోతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ రేర్‌ వీడియో క్లిప్‌ వైరల్‌ అవుతుంది. ఇందులో `రాఖీ` సినిమా చేయడానికి కారణమేంటో తెలిపారు తారక్‌. 
 

ఎన్టీఆర్‌ కమర్షియల్‌ హీరోగా ఎదిగారు. అద్భుతమైన డాన్సులు, డైలాగ్‌లు, అంతకు మించిన అత్యద్భుతమైన నటనతో మెప్పిస్తూ వస్తున్నారు. `స్టూడెంట్‌ నెం 1`తో హిట్‌ అందుకుని హీరోగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన తారక్‌..

ఆ తర్వాత `ఆది`, `సింహాద్రి`, `యమదొంగ`, `అదుర్స్`, `బృందావనం`, `టెంపర్‌`, `నాన్నకు ప్రేమతో`, `జై లవకుశ`, `అరవింద సమేత`, `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాలతో ఎదుగుతూ వచ్చాడు. హీరోగా ఇమేజ్‌, స్టార్‌డమ్‌ పెంచుకుంటూ వచ్చారు తారక్‌. 
 

`ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే గ్లోబల్‌ వైడ్‌గా ఆయన గురించి తెలిసింది. ఈ సినిమా సమయంలోనే హాలీవుడ్‌ యాక్టర్స్ సైతం ఎన్టీఆర్‌ గురించి, ఆయన నటన గురించి మాట్లాడుకున్నారు. తారక్‌ నటనపై ప్రశంసలు కురిపించారు.

దీంతో ఆయన క్రేజ్‌తోపాటు రేంజ్‌ పెరిగింది. దాన్ని మరింత పెంచేందుకు ఇప్పుడు `దేవర` చిత్రంతో రాబోతున్నాడు ఎన్టీఆర్‌. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెలలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 


ఈ నేపథ్యంలో చిత్రప్రమోషన్స్ కి సంబంధించిన జోరు పెంచారు. ఇటీవలే మూడో పాటని విడుదల చేశారు. `దావూదీ` అంటూ సాగే ఈ పాట బాగానే ఆదరణ పొందింది. మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. దీనికి అనిరుథ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌ అందించారు. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎన్టీఆర్‌, జాన్వీల మధ్య బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు రొమాంటిక్ సాంగ్‌లు బాగానే వర్కౌట్‌ అయ్యాయి. తారక్‌ డాన్సులు మాత్రం ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉన్నాయని చెప్పొచ్చు. థియేటర్లలో ఫ్యాన్స్ బాగా ఎంజాయ్‌ చేస్తారు. 
 

మరో 20(సెప్టెంబర్‌ 27న) రోజుల్లో `దేవర` చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగా పాత ఇంటర్వ్యూ క్లిప్‌లు చక్కర్లు కొడుతున్నాయి.

అందులో భాగంగా `రాఖీ` సినిమా గురించి స్పందించారు తారక్‌. ఆ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాడు. ఈ సందర్భంగా మగవాళ్లకి వార్నింగ్‌ కూడా ఇచ్చాడు. ఆడవాళ్ల ఊసురు పోసుకోవద్దు అని తెలిపాడు.

`మగాడైన ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది ఇది. ఆడపిల్లల ఊసురు పోకోకండి. అది చాలా చెత్తగా ఉంటుంది. నేను `రాఖీ` సినిమా చేసిన ఉద్దేశ్యమే అది అని చెప్పాడు ఎన్టీఆర్‌. గతంలో చెప్పిన ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుండటం విశేషం. 
 

కృష్ణవంశీ దర్శకత్వం వహించిన `రాఖీ` చిత్రం 2006 డిసెంబర్‌లో విడుదలైంది. అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చూసిన రాఖీ.. ఎలా స్పందించాడు. అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడిన వాళ్లని ఎలా అంతం చేశాడనే కథాంశంతో ఆ మూవీని తెరకెక్కించారు.

ఇందులో ఎన్టీఆర్‌ నటన పీక్‌లో ఉంటుంది. కన్నీళ్లు పెట్టిస్తుంది. అమ్మాయిలంతా ఆయనకు రాఖీ కట్టే సీన్‌ అదిరిపోయింది. ఫైనల్‌గా ఈ సినిమా ఆడలేదు. కానీ ప్రతి అమ్మాయికి నచ్చే చిత్రమవుతుంది. ఇందులో తారక్‌కి జోడీగా ఇలియానా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా థియేటర్లో ఆడలేకపోయినా, ఆయన కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచింది.  
 

Latest Videos

click me!