Bigg Boss Telugu 8: ప్రకటనకు ముందే లిస్ట్ లీక్.. మొత్తం 17మంది సెలెబ్స్, సీరియల్ స్టార్స్ కి పెద్దపీట!

By Sambi ReddyFirst Published Aug 25, 2024, 12:21 PM IST
Highlights

అధికారిక ప్రకటనకు ముందే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లిస్ట్ లీకైంది. హౌస్లోకి వెళ్లనున్న 17 మంది సెలెబ్స్ పేర్లు లీక్ అయ్యాయి. వీరిలో సీరియల్ నటులు అధికంగా ఉన్నారు. 
 

తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది. మరో వారం రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 7 గంటలకు సీజన్ 8 మొదటి ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు కంప్లీట్ అయినట్లు సమాచారం. అనూహ్యంగా అధికారిక ప్రకటనకు ముందే కంటెస్టెంట్స్ లిస్ట్ లీకైంది. బిగ్ బాస్ హౌస్లో అడుగుపెడుతున్న 17 మంది సెలెబ్స్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

బిగ్ బాస్ షో నిబంధనల ప్రకారం గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ముగిసేవరకు టోటల్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది రహస్యం. హోస్ట్ నాగార్జున గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిగా పరిచయం చేస్తాడు. అయితే పలు కారణాలతో ముందే కంటెస్టెంట్స్ పేర్లు లీక్ అవుతాయి. లేటెస్ట్ సీజన్ కంటెస్టెంట్స్ వీరే అంటూ ఓ లిస్ట్ హల్చల్ చేస్తుంది. అందులో ఉన్న సెలెబ్స్ ఎవరో చూద్దాం... 

Latest Videos

సోషల్ మీడియా స్టార్స్ కోటాలో బెజవాడ బేబక్క, బంచిక్ బబ్లు ఎంపికయ్యారట. మెజారిటీ కంటెస్టెంట్స్ బుల్లితెర సెలెబ్రిటీలు అని తెలుస్తుంది. జబర్దస్త్ ఫేమ్ పవిత్ర, కమెడియన్ యాదమ్మ రాజు లకు అవకాశం దక్కిందట. వీరిద్దరూ సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట. మెజారిటీ కంటెస్టెంట్స్ సీరియల్ నటులు అట. యాష్మి గౌడ, తేజస్విని గౌడ, నిఖిల్, అంజలి పవన్, ఇంద్రనీల్ బిగ్ బాస్ హౌస్లో సందడి చేయనున్నారట. 

ఇక ఇద్దరు వెండితెర నటులు ఎంట్రీ ఇస్తున్నారట. వారిలో ఒకరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సన. ఈమె చాలా కాలంగా టాలీవుడ్ లో రాణిస్తుంది. బాగా తెలిసిన సెలబ్రిటీ. లాహిరి లాహిరి లాహిరిలో మూవీ ఫేమ్ ఆదిత్య ఓం సైతం సీజన్ కి ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నాడట. యాంకర్స్ సౌమ్యరావు, రీతూ చౌదరి సైతం ఎంపిక కాగా...వీరు బిగ్ బాస్ 8కి స్పెషల్ అట్రాక్షన్ కానున్నారనే వాదన వినిపిస్తోంది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే... 

రీతూ చౌదరి 
సుబ్బు 
అభిరామ్ వర్మ
తేజస్విని గౌడ 
నిఖిల్ 
యాదమ్మ రాజు 
సీత 
సింగర్ సాకేత్
 యష్మి గౌడ
సన  
బెజవాడ బేబక్క 
పవిత్ర 
ఇంద్రనీల్ 
ఆదిత్య ఓం 
బంచిక్ బబ్లు 
సౌమ్యరావు

అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. అధికారిక సమాచారం కాదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ లిస్ట్ రూపొందించినట్లు తెలుస్తోంది. 


 

Pic credit: Srinivasa Rao Manchala Facebook Page

click me!