స్కూల్ తప్పించుకోవడం కోసం అమితాబచ్చన్ చేసిన తిక్క పని ఏంటో తెలుసా..?

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సరదా విషయాన్ని షేర్ చేసుకున్నారు. చిన్నతనంలో తను స్కూల్ ఎగ్గొట్టడానికి చేసిన  ఓ తింగరి పని గురించి వెళ్ళడించారు. ఇంతకీ ఆ పని ఏంటి..? 
 

బాలీవుడ్ ప్రముఖ నటులలో అమితాబ్ బచ్చన్ ఒకరు. అతని నటనా నైపుణ్యం, తెలివితేటలు, అద్భుతమైన వ్యక్తిత్వం మరియు అపరిమితమైన ఆత్మవిశ్వాసం.. బిగ్ బీని ఆ స్థానంలో కూర్చోబెట్టింది. 80 ఏళ్ళ వయస్సులో కూడా ఇప్పటికీ నటిస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు అమితాబ్. 
 

అమితాబ్ బచ్చన్ దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో  హీరోగా  కెరీర్‌ను కొనసాగించి ఉన్నత స్థాయికి ఎదిగారు. 81 ఏళ్ల వయసులో అమితాబ్ ఇప్పటికీ యంగ్ స్టార్స్ కు పోటీ ఇస్తూ.. నటిస్తున్నారు. తన ఊపిరి ఉన్నంత వరకూ నటిస్తానని ఆయన ఓ సందర్భంలో వెల్లడించారు. 

ఇక బిగ్ బి అమితాబ్ నటించిన తెలుగు సినిమా.. పాన్ ఇండియా మూవీ కల్కి 2898 AD సినిమా సంచలనం సృష్టించడమే కాకుండా.. బాక్సాఫీస్ నుషేక్ చేసే విధంగా కలెక్షన్లు కూడా సాధించింది. ఇక టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తున్నారు అమితాబ్. 


ఇక అమితాబ్ కోసమే డిజైన్ చేసినట్టుగా ఉంటుంది కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్. ప్రస్తుతం ఈ షో  16వసీజన్‌ ను అమితాబ్ హోస్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎప్పటికప్పుడు తన జీవిత విశేషాలను చెబుతూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు అమితాబ్. 

ఇక తాజాగా అమితాబచ్చన్ తన  చిన్ననాటి సంఘటనల గురించి ఓ ఫన్నీ విషయాన్ని వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచారు. KBC 16 తాజా ఎపిసోడ్‌లో, కంటెస్టెంట్  శోభికా శ్రీ తన వృత్తి జీవితం, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాల గురించి వివరాలు  పంచుకున్నారు. 
 

తాను హెల్త్‌కేర్ మరియు మెడికల్ సర్వీసెస్ సెక్టార్‌లో పనిచేస్తున్నానని, పని ఓత్తిడితో పాటు.. ఎప్పుడూ డ్యూటీలో ఉండటం కారణంగా.. తన భర్తతో సంతోషంగా ఉండలేకపోతున్నాని. తన ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తోందని శోభిక పేర్కొంది. ఈ సమయంలో ఆమె మాటలు విన్న అమితాబ్ బచ్చన్ ఆమెకు ఓ ఉపాయం చెప్పారు. 

ఇలాంటి సందర్భాల్లో పని నుంచి తప్పించుకోవడం కోసం.. కొన్ని చిట్కాలు ఉపయోగించవచ్చని.. తాను కూడా చిన్నప్పుడు అలానే చేశానని అన్నారు.  తాను స్కూల్ కు వెళ్ళకుండా తప్పించుకోవడానికి ఎలాంటి ట్రిక్స్ వాడాడో ఆసక్తికరంగా వివరించాడు.

బిగ్ బి మాట్లాడుతూ, "నేను స్కూల్లో ఉన్నప్పుడు, నేను నా ఆరోగ్యం గురించి అబద్ధాలు చెప్పేవాడిని, నేను పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడని కారణంగా నేను అనారోగ్యంతో ఉన్నానని ఇంట్లో వాళ్లను.. బయట వాళ్లను  నమ్మించేవాడిని. నేను తప్పించుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించాను అన్నారు. 
 

ఆ రోజుల్లో చంక కింద ఉల్లిపాయ పెట్టుకుంటే జ్వరం వస్తుందని చెప్పేవాళ్లు. తను వచ్చినట్లు కుటుంబ సభ్యులను మోసం చేసేవాడినని బాల్యం కొనసాగించి మొదటి సారి B.Sc లో ఫెయిల్ అయ్యి మళ్లీ పరీక్ష రాసి 42% మార్కులు తెచ్చుకుని పాసయిన వ్యక్తి గురించి బిగ్ బీ వివరించారు. ప్రస్తుతం అమితాబ్ చెసిన ఈ వ్యాక్యలు వైరల్ అవుతున్నాయి. 

Latest Videos

click me!