Cricket
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భారత సైన్యంలో పారాచూట్ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్ కల్నల్ హోదాను కలిగి ఉన్నారు. 2011లో ఈ హోదాను పొందారు.
2020 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం, 2024 ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రాకు నాయబ్ సుబేదార్ రాజ్‌పుతానా రైఫిల్స్ హోదాను ప్రదానం చేశారు.
సచిన్ టెండూల్కర్ అనేక క్రికెట్ రికార్డులతో గాడ్ ఆఫ్ క్రికెట్ గా ప్రసిద్ధి చెందారు. సచిన్ భారత వాయుసేనలో గ్రూప్ కెప్టెన్ హోదాను కలిగి ఉన్నారు.
రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 2004లో డబుల్ ట్రాప్ షూటింగ్‌లో భారతదేశం తరపున మొట్టమొదటి వ్యక్తిగత ఒలింపిక్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఆయన జమ్మూ కాశ్మీర్‌లో కల్నల్ హోదా ఉంది.
దీపక్ పూనియా 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో భారతదేశం తరపున స్వర్ణం సాధించాడు. నీరజ్ చోప్రా మాదిరిగానే దీపక్ కూడా భారత సైన్యంలో నాయబ్ సుబేదార్ హోదాను కలిగి ఉన్నారు.
కీర్తిశేషులు అథ్లెట్ మిల్ఖా సింగ్ అనేక అంతర్జాతీయ స్థాయిలలో భారతదేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చారు. మిల్ఖా సింగ్ భారత సైన్యంలో గౌరవ కెప్టెన్ హోదాను పొందారు.
వన్డే ప్రపంచ కప్ గెలిచిన తొలి భారత క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్. కపిల్‌కు భారత సైన్యం లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రదానం చేసింది.