స్టార్ హీరో దళపతి విజయ్ కు కోటిన్నర ఫైన్, కోర్టు తీర్పు పై ఫ్యాన్స్ లో ఉత్కంఠ

First Published | Oct 13, 2023, 9:05 AM IST

ప్రస్తుతం తమిళనాట నుంచి స్టార్ హీరోలలో దళపతి విజయ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అది సినిమాల విషయం కావచ్చు.. లేదా వివాదాలు కావచ్చు.. ఎక్కువగా ఆయన పేరే వినిపిస్తోంది. తాజాగా విజయ్ కు సబంధించిన మరో న్యూస్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. 

కొన్ని సినిమాలు కెరీర్ ను నిలబెడతాయి అనుకుంటే.. అట్టడుగుకి పడేస్తాయి. మరికొన్ని అనూహ్య విజయంతో లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ను అందిస్తాయి మరికొన్ని సినిమాలు మాత్రం ప్లాప్అవ్వడంతో పాటు.. ఎన్నేళ్లయినా.. ఏదో రకంగా  వెంటాడుతూ.. వేదిస్తుంటాయి. సరిగ్గా అలాంటిసినిమానే తమిళ స్టార్ హీరో విజయ్ ను వెంటాడుతోంది. ఇంతకీ ఎంటా కథ. 

puli movie

 విజయ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని నమ్మకంగా చేసిన సినిమా పులి. ఈసినిమా రిలీజ్ అయ్యి రచ్చ చేస్తుంది అనుకుంటే.. ప్లాప్ అయ్యి విజయ్ ను నిరుత్సాహపరిచింది. అంతే కాదు  ఫ్యాన్స్‌ అయితే ఆ సినిమా చూసి చివుక్కుమన్నారు. అయితే ఆ సినిమా ప్లాప్ అయ్యింది. సరే ప్లాప్ లలో ఇదో ప్లాప్ కదా.. మర్చిపోదాం అనుకుంటే.. ఆసినమా  వచ్చి ఇన్నాళ్లయినా ఇంకా విజయ్‌ను ఇబ్బందిపెడుతూనే ఉంది. 


అయితే ఈసారి మాత్రం ఈ ఇబ్బందులు  విజయ్‌ పొరపాటు వల్ల  వచ్చినట్టు తెలుస్తోంది. పులి సినిమా  గతంలో రిజల్ట్ రూపంలో ఇబ్బంది పెడితే.. ఇప్పుడు ఆర్ధికంగా  సమస్యలు తీసుకొచ్చింది. ఆ సినిమా ఆదాయం లెక్కల్లోకి చూపించలేదంటూ ఆదాయపు పన్ను శాఖ నివేదిక సిద్ధం చేసింది. విజయ్‌కు 1.50 కోట్ల జరిమానా విధించింది. అయితే ఈ  విషయం కోర్డ్ లో ఉండటంతో..  ఆదాయపన్ను శాఖ మద్రాసు హైకోర్టులో నివేదిక దాఖలు చేసింది.

2015-16 ఆర్థిక సంవత్సరానికి విజయ్‌ ఐటీ రిటర్ను దాఖలు చేసినప్పుడు ఆ ఏడాది ఆదాయం 35,42,91,890గా చూపించాడట. అయితే ఆదాయపన్నుశాఖ లెక్కలు చూసేటప్పుడు పులి సినిమాకు తీసుకున్న 15 కోట్ల ఆదాయాన్ని లెక్కల్లో చూపలేదని తెలిసింది. విజయ్‌ ఇంట్లో 2015 సెప్టెంబరు 30న జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల్లో ఈ విషయం బయటపడిందట. దీంతో ఆదాయాన్ని దాచినందుకు 1.50 కోట్ల జరిమానా విధిస్తూ ఆదాయపన్నుశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 
 

Thalapathy Vijay

అయితే ఉన్నవాడు ఊరికే ఉండకుండా.. వాటిని రద్దు చేయాలని విజయ్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఆ పిటిషన్‌ విచారించిన హైకోర్టు ఆదాయపన్నుశాఖ ఉత్తర్వులకు మధ్యంతర నిషేధం విధించింది. పిటిషన్‌పై ఆదాయపన్ను శాఖ జవాబు ఇవ్వాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌ రీసెంట్ గా విచారణ నిర్వహించారు. 
 

puli movie

ఈసారి పక్కాగా విజయ్‌కు 1.50 కోట్లు జరిమానా ఎందుకు  విధించాల్సి వచ్చిందీ అన్నాదానిపై పక్కా ఎవిడెన్స్ ను  ఐటీ శాఖ కోర్టుకు సమర్పించింది. దీంతో న్యాయ స్థానం తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఇక పరిస్థితులు చూస్తుంటే.. విజయ్ కు వ్యతిరేకంగానే తీర్పు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు నిఫుణులు.  దీంతో ఈ విషయంలో ఏం జరుగుతుందో అని విజయ్ అభిమానులు  ఆందోళన చెందుతున్నారు. 
 

Vijay Leo collects one crore before release in Malasia Thalapathy will beat Rajinikanths record

ప్రస్తుతం లియో రిలీజ్ హడావిడిలో ఉన్నాడు దళపతి విజయ్. ఈమూవీని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయగా.. ఈమూవీపై భారీ అంచనాలుఉన్నాయి ఇటు తెలుగులో కూడా మరో సినిమాను లైన్ లో పెడుతున్నాడు విజయ్. పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకోవాలి అని చూస్తున్నాడు. మరోవైపు విజయ్ రాజకీయ ఆరంగేట్రానికి సబంధించిన కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. 

Latest Videos

click me!