Thug Life First Review: కమల్ హాసన్ విక్రమ్ రేంజ్ హిట్ కొట్టగలడా ?
మణిరత్నం, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో రూపొందిన గ్యాంగ్‌స్టర్ డ్రామా థగ్ లైఫ్. జూన్ 5న రిలీజ్ అవుతున్న థగ్ లైఫ్ మూవీ కమల్ హాసన్ కు హిట్ ఇవ్వగలదా? విక్రమ్ తో భారీ సక్సెస్ ను సాధించిన కమల్ హాసన్ కు థగ్ లైఫ్ తో మరో బ్లాక్ బస్టర్ అందుతుందా. .?

దాదాపు 35 ఏళ్ల తరువాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా థగ్ లైఫ్. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై తెరకెక్కిన ఈసినిమాలో త్రిష, అభిరామి హీరోయిన్లుగా నటించారు.
కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్, ఉదయనిధి స్టాలిన్ సంయుక్తంగా నిర్మించిన థగ్ లైఫ్ సినిమాలో తనికెళ్ల భరణి , ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, మహేష్ మంజ్రేకర్ లాంటి స్టార్లు నటించారు.
జూన్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి సెన్సార్ బోర్డు అధికారుల రివ్యూ వచ్చేసింది. థగ్ లైఫ్ సినిమా కథను కమల్ హాసన్, మణిరత్నం ఇద్దరు కలిసి రాసుకున్నారు. మాఫియా సామ్రాజ్యాన్ని తన కన్ను సన్నల్లో పాలించే రంగరాయ శక్తివేల్(కమల్ హాసన్) కు మాణిక్యంకు మధ్య విభేదాలు తలెత్తుతాయి.
మాణిక్యం జరిపిన కాల్పుల నుంచి రంగరాయ శక్తివేల్‌ను అమరన్ (శింబు) కాపాడుతాడు. దాంతో తనకు ప్రాణ భిక్షపెట్టిన అమరన్‌ను శక్తివేల్ తన ప్రాణంగా పెంచుకుంటాడు. అయితే అంతలా ప్రేమగా పెంచిన అమరన్ పెద్దవాడు అయిన తరువాత శక్తివేల్‌కు ఎదురు తిరుగుతాడు. ఈ ఘర్షణలో మాఫియా సామ్రాజ్యంలో ఎలాంటి కుదుపులు వచ్చాయి. ఆతరువాత జరిగిన పరిణామాలు ఏంటీ అనేది థగ్ లైఫ్ సినిమా కథ.
థగ్ లైఫ్ సినిమా రీసెంట్ గానే సెన్సార్ కంప్లీట్ అయ్యింది. కొన్ని సన్నివేశాలు వారిని కూడా ఇంప్రెస్ చేశాయి. మరికొన్ని సీన్స్ మాత్రం సరిగ్గా లేనందున వాటిని మ్యూట్ చేయాలని ఆదేశించారు టీమ్. అభ్యంతరకరమైన సన్నివేశాలకు సంబంధించిన సౌండ్ ను మ్యూట్ చేసినట్టు తెలుస్తోంది. విశేషం ఏంటంటే ఈ సినిమాలోని సన్నివేశాలకు ఎలాంటి కట్స్ లేకుండా సినిమాను ఆమోదించి దానికి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాపై సెన్సార్ టీమ్ హ్యాపీగా ఉన్నట్ట మూవీ టీమ్ వెల్లడించింది.
నాయకుడు సినిమా తరువాత మణిరత్నం, కమల్ హాసన్ ఇద్దరు థగ్ లైఫ్ కోసం జత కలిశారు. ఈ సినిమాలోని కొన్ని పాత్రలను ఎమోషనల్‌గా, ఇంటెన్సివ్‌గా మలిచారు దర్శకుడు. వారి మరీ ముఖ్యంగా కమల్ హాసన్, శింబు ఇద్దరికి ఇద్దరు పోటీ పడి నటించారు. వారిద్దరు కలిసి చేసిన సన్నివేశాలు ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయబోతున్నాయి. సెన్సార్ అధికారులను మెప్పించిన ఈ సీన్స్ కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాయి. ఇక త్రిష, అభిరామి, నాజర్, పంకజ్ త్రిపాఠి, జోజు జార్జ్ చేసిన పాత్రలు కూడా అద్భుతంగా వచ్చినట్టు తెలుస్తోంది.
యాక్షన్, ఎమోషనల్, లవ్, సస్సెన్స్, థ్రిల్లర్ అంశాల కలయికలో థగ్ లైఫ్ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో శృంగార సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ హైలెట్ అవ్వబోతున్నాయి. మరీ ముఖ్యంగా 70 ఏళ్ల వయస్సులో కమల్ హాసన్ త్రిషతో నటించిన సీన్స్ విషయంలో విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఈసినిమాలు క్రైమ్ తో పాటు ఇతర విషయాలగు దృష్టిలో పెట్టుకుని సెన్సార్ టీమ్ యూఏ (UA) 16+ సర్టిఫికెట్ ఇచ్చారు.
ఇక ఈ సినిమాకు రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ థగ్ లైఫ్ కు కీలకం కాబోతోంది. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణుల పనితీరుపై సెన్సార్ అధికారులు పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక థగ్ లైఫ్ రన్ టైమ్ విషయానికి వస్తే.. 2 గంటల 45 నిమిషాల నిడివితో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఇక ఈ సినిమాను తమిళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతుండగా.. కన్నడాలో కమల్ హాసన్ వివాదం కొనసాగుతుంది. దాంతో అక్కడ ఆ సినిమాను రిలీజ్ చేయడంలేదని అక్కడి సినిమా సంఘాలు ప్రకటించాయి.