- Home
- Entertainment
- 10 మంది పిల్లలను కనాలని ఉంది, టాలీవుడ్ హీరోయిన్ వింత కోరిక ,నెటిజన్లు ఏమంటున్నారంటే?
10 మంది పిల్లలను కనాలని ఉంది, టాలీవుడ్ హీరోయిన్ వింత కోరిక ,నెటిజన్లు ఏమంటున్నారంటే?
ఈమధ్య కొంత మంది హీరోయిన్లు వింత వింత వ్యాఖ్యలు చేస్తూ.. ట్రోలింగ్ కు గురవుతున్నారు. వివాదాస్పదం అవుతున్నారు. ఈక్రమంలో తనకు 10 మంది పిల్లలని కనాలని ఉంది అంటూ.. టాలీవుడ్ హీరోయిన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిన హీరోయిన్లు. సడెన్ గా ఇండస్ట్రీని వదిలి ఫ్యామిలీ లైఫ్ లో సెట్ అవుతున్నారు. అలా సినిమాలు మానేసి.. పెళ్లి చేసుకుని సెటిల్ అయిన హీరోయిన్లలో సనా ఖాన్ కూడా ఒకరు. సినిమా రంగాన్ని వీడిన తర్వాత మతపరమైన జీవితం ప్రారంభించిన సనా ఖాన్ తన భవిష్యత్తు కుటుంబ ప్రణాళికలపై చేసిన వ్యాఖ్యలకు నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
సనా ఖాన్, తన భర్త అనాస్ సయ్యద్‌తో కలిసి ప్రస్తుతం రెండవ సంతానాన్ని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆమె ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో మాట్లాడుతూ, "పూర్వకాలంలో మహిళలు 12 మంది పిల్లలను ప్రసవించేవారు. నేను కూడా 10 మంది వరకూ పిల్లలను కనాలని కోరిక ఉంది అని తెలిపారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆమె వ్యాఖ్యలను విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయంలో నెటిజన్లు భగ్గుమంటున్నారు. 10-12 మంది పిల్లలకు జన్మనివ్వడం అంత తేలికేనా?’ అని ఒకరు అడిగారు. మీకు పనివారు ఉన్నారు కాబట్టి ఈ విధంగా మాట్లాడగలుగుతున్నారు అని మరొకరు, ఇండియాలో జనాభా అధికంగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు అని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.
సనా ఖాన్ తన భవిష్యత్తు గురించి, తన ప్లాన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ, ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చకు కారణమయ్యాయి. సనా ఖాన్ భర్త గుజరాత్‌లోని సూరత్ కు చెందిన వ్యక్తి. పేరు ముఫ్తీ అనస్ సయ్యద్. ఆయన ఒక మత నాయకుడు, ఇస్లామిక్ పండితుడు. సనా ఎజాజ్ ఖాన్ ద్వారా ముఫ్తీకి పరిచయమైంది.