సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రేక్ ఫాస్ట్ సీక్రేట్.. అందుకే అంత ఫిట్ గా ఉంటాడట..

Mahesh Jujjuri | Published : Jul 18, 2023 5:39 PM
Google News Follow Us

ఇంకా  రెండు మూడేళ్లయితే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కు 50 ఏళ్ళు వస్తాయి అయినా సరే.. 20 ఏళ్ల కుర్రాడిలా ఫిట్ గా ఉంటాడు..  సూపర్ స్టార్ ఫిట్ నెస్ కు కారణం ఏంటీ..? ఆయన అసలు ఏం తింటాడు..? 
 

16
సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రేక్ ఫాస్ట్ సీక్రేట్.. అందుకే అంత ఫిట్ గా ఉంటాడట..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రస్తుతం  47 ఏళ్ళు నెక్ట్స్ మన్త్ ఆయన 48లోకివస్తారు. ఇంకా రెండేళయితే.. 50 ఏళ్లవయస్సులోకి వస్తాడు సూపర్ స్టార్.. అయినా సరే 20 ఏళ్ల కుర్రాడిలా ఉత్సాహంగా ఉంటాడు. ఫిట్ బాడీతో.. ఆరోగ్యంగా ఉంటారు. వర్కౌట్స్ అనేవి ప్రతీ హీరోకి కామన్ గా ఉండేవే.. కాని వారి డైట్ సీక్రేట్ గురించి ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదరుచూస్తుంటారు. 

26
Photo Courtesy: Instagram

అసలే వాళ్ళు ఏం తింటారు.. ఏం తింటే ఇలా ఫిట్ గా ఉంటారు అనేది తెలుసుకోవడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అంతే కాదు అది వాళ్లు కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అంతే కాదు సూపర్ స్టార్ ఇంటర్వ్యూల్లో కూడా.. మీరు ఇలా ఉంటారు.. అసలేఏంతింటారు అనే ప్రశ్నలు ఎదురవుతుంటాయి. 

36

ఆసందర్భాల్లో నవ్వి ఊరుకుంటుంటాడు మహేష్. కొన్ని ఇంటర్యూల్లో మాత్రం ఆయన తన ఫుడ్ హ్యాబిడ్స్ గురించి వెల్లడించాడు. అందరు తినేవే తాను తింటానని.. కాకపోతే లిమిట్ గా తింటానంటూ ఓ ఇంటర్వ్యూలో మహేష్ అన్నారు. ఇష్టం కదా అని ఫాటీ ఫుడ్స్ ఎక్కువగా లాంగించేయనన్నారు.. ఇక డైరీ ఫుడ్స్ కాని.. ఫ్యాటీ ఫుడ్స్ కాని ముట్టుకోనంటున్నారు మహేఫ్. ఈక్రమంలో ఆయన సోషల్ మీడియాలో తన ఫుడ్ సీక్రేట్ గురించి వెల్లడించాడు. 

Related Articles

46

మహేష్ ఇప్పటికి కూడా అంత అందంగా, ఫిట్ గా ఉండటానికి కారణం ముఖ్యంగా ఫుడ్. గతంలో కూడా పలు సార్లు మహేష్ ఇదే చెప్పాడు. నేను ఏది పడితే అది తినను, ఫుడ్ లో జాగ్రత్తగా ఉంటాను అని తెలిపాడు. తనకి సపరేట్ కుక్ కూడా ఉంటాడు. షూటింగ్స్ కి వెళ్లినా అక్కడి ఫుడ్ తినకుండా తన కుక్ వండిందే తింటాడని గతంలో తెలిపారు మహేష్. మహేష్ డైరీ ప్రొడక్ట్స్, స్వీట్స్ కూడా ఏవి తినను అని చెప్పాడు ఓ ఇంటర్వ్యూలో.

56

తాజాగా తను రోజూ ఉదయం తినే బ్రేక్ ఫాస్ట్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తను బ్రేక్ ఫాస్ట్ తింటున్న ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి.. ఇది నా డైలీ రొటీన్. రాత్రంతా నానబెట్టిన ఓట్స్, కొన్ని మొలకెత్తిన గింజలు, విత్తనాల్ని కలిపి తీసుకుంటాను. కొన్ని గంటల వరకు నాకు ఇదే పవర్ ని ఇస్తుంది. ఇదే నా బ్రేక్ ఫాస్ట్ అని తెలిపాడు. అలాగే తన న్యూట్రిషనిస్ట్ ల్యూక్ కౌంటినోని ట్యాగ్ చేసి ఒక మంచి న్యూట్రీషియన్ అని చెప్పాడు మహేష్.
 

66
Mahesh Babu

సూపర్ స్టార్ చెప్పిన బ్రేక్ ఫాస్ట్ సీక్రేట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఫ్యాన్స్  ఈ విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో  గుంటూరుకారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు. భారీ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతుందీ మూవీ. 

Recommended Photos