కాగా తరచుగా తనకు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) అంటే ఇష్టమని జాన్వీ చెబుతూ ఉంటారు. ఇటీవల కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్న జాన్వీ ... హీరో విజయ్ దేవరకొండతో డేట్ కి వెళ్ళడానికి సిద్ధం అన్నారు. జాన్వీ, సారా హీరో దేవరకొండ కోసం గొడవపడటం విశేషం. పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతున్నా హీరోయిన్ గా జాన్వీకి బ్రేక్ రాలేదు. ఆమె అడపాదడపా చిత్రాలు చేస్తున్నప్పటికీ భారీ హిట్ ఆమె ఖాతాలో పడలేదు. స్టార్స్ పక్కన జాన్వీకి ఇంకా అవకాశాలు రావడం లేదు.