siddu jonnalagadda
డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నల గడ్డ ఏ సినిమా నటించిన అందులో ఎనర్జీ టన్నుల్లో ఉంటుంది. ప్రతి సీన్‌లోనూ తనదైన చలాకీతనం, డైలాగ్ చెప్పడంలో తుంటరి తనం.. ఏదో మన ఇంటి పక్కనోడు, తెలిసినోడో మాట్లాడినట్లు ఉంటుంది అతని స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ. త్వరలో జాక్ అనే యాక్షన్ సినిమాతో మనముందుకు వస్తున్నాడు సిద్దూ. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల చేయగా.. ఈ సందర్బంగా డైరెక్టర్, నిర్మాత, హీరో, హీరోయిన్లు మీడియాతో ముచ్చటించారు.
siddu jonnalagadda
తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటించిన జాక్ సినిమాలో ట్రైలర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మునుపటి సినిమాలకంటే భిన్నంగా అటు దర్మకుడు భాస్కర్, నటుడు సిద్దు సినిమాలకు భిన్నంగా ఉంది. ఈ కథ టెర్నరిస్ట్ నేపథ్యంలో సీరియస్ కథను కొంచెం సిద్దూకి తగ్గట్లు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ట్రైలర్ మాత్రం యాక్షన్, సిద్దూ మార్క్ ఎనర్జీతో అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
siddu jonnalagadda
గతంలో భాస్కర్ తీసిన చిత్రాలు అన్ని కుటుంబ నేపథ్యంలో ఎలాంటి వల్గారిటీ లేకుండా ఉండేవి. కానీ జాక్ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత విచ్చలవిడిగా బూతులు వాడినట్లు కనిపిస్తోంది. మరి ఈ సినిమా కుటుంబంతో చూడొచ్చా అని అడిగితే సినిమాలో మంచి కథ ఉందని భాస్కర్‌ను నమ్మి ఫ్యామిలీస్ రావచ్చని అసలు జవాబు చెప్పలేదు. ఇక బేబీ సినిమాతో అదరగొట్టిన హీరోయిన్ వైష్ణవి జాక్‌లో తన నటనతో అందరినీ కట్టిపడేస్తుందని డైరెక్టర్ చెప్పుకొచ్చారు. ఓ సీన్‌లో జస్ట్ తన కళ్లతోనే నటించి తనని మెస్మరైజ్ చేసిందని ఈ సీన్ అందరికీ బాగా నచ్చుతుందని ఆయన అన్నారు.
siddu jonnalagadda
జాక్ సినిమాలో బూతుల గురించి నటుడు సిద్దూ స్పందిస్తూ.. బూతులు ఎందుకు వాడారు అంటే వాడాల్సి వచ్చింది అందుకే వాడాం అని సమాధానం చెప్పాడు. మరి సెన్సార్ అయ్యిందా అంటే ఆ విషయం నాకు తెలియదని చెప్పుకొచ్చాడు. జనాలు ఎలా చూస్తారు అని అడగగా.. దీనిపై స్పందించలేదు. మొత్తంమీద ఈ సీన్లు పెట్టడం వెనుక డైరెక్టర్ భాస్కర్ పాత్ర లేదని తెలుస్తోంది.
siddu jonnalagadda
ఇక జాక్ సినిమా కథ భాస్కర్‌ది అయినా.. సిద్దు జొన్నలగడ్డ, అతని పీఆర్ టీం అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయినట్లు ట్రైలర్ చూసిన అందరికీ స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో డైరెక్టర్, హీరోలు కూడా అంగీకరించారు. అంతేకాకుండా డైరెక్టర్ భాస్కర్‌కు అతని టీం మధ్య క్రియేటివ్ డిఫరెన్సెన్ వచ్చాయని భాస్కర్ చెప్పుకొచ్చారు. సీన్ బాగా రావడం కోసం అలా జరుగుతుంటాయని అన్నారు. ఇక జాక్‌లోని ఓ పాట షూటింగ్‌ను డైరెక్టర్ లేకుండానే సిద్దూ చేసేశాడంట. డైరెక్టర్‌ను రమ్మంటే నాకు ఎడిటింగ్ పని ఉండి.. సాంగ్ షూటింగ్‌కు నేనెందుకు నువ్వు ఉన్నావుగా చూసుకోమని సిద్దూకి డైరెక్టర్ భాస్కర్ చెప్పాడంట.