లండన్ లో భారీ థియేటర్ రూఫ్ టాప్ పైకి ఎక్కి షాకిచ్చిన వరల్డ్ ఫేమస్ స్టార్ టామ్ క్రూజ్‌

Google News Follow Us

సారాంశం

హాలీవుడ్ సూపర్‌స్టార్ టామ్ క్రూజ్ మరోసారి తన స్టంట్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆదివారం మధ్యాహ్నం లండన్‌లోని బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (BFI) ఐమాక్స్ భవనంపై నిలుచున్న టామ్ క్రూజ్‌ను ఫోటోగ్రాఫర్లు చిత్రీకరించారు. 

హాలీవుడ్ సూపర్‌స్టార్ టామ్ క్రూజ్ మరోసారి తన స్టంట్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆదివారం మధ్యాహ్నం లండన్‌లోని బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (BFI) ఐమాక్స్ భవనంపై నిలుచున్న టామ్ క్రూజ్‌ను ఫోటోగ్రాఫర్లు చిత్రీకరించారు. ఈ అనూహ్య సంఘటన సోమవారం జరిగే బీఫ్ఐ ఫెలోషిప్ అవార్డు కార్యక్రమానికి ముందు చోటు చేసుకోవడం గమనార్హం. బీఫ్ఐ ఫెలోషిప్ అనేది బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ అందించే అత్యున్నత గౌరవం.

ప్రస్తుతం BFI IMAX భవనం మొత్తం మిషన్ ఇంపాసిబుల్ – ది ఫైనల్ రెకనింగ్  సినిమా భారీ ప్రకటనతో కప్పబడి ఉంది. ఈ చిత్రం టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ యొక్క ఎనిమిదో భాగం. క్రూజ్ భవనం పై కనిపించడం ప్రమోషన్‌లో భాగమా అన్న దానిపై స్పష్టత రాలేదు. అయితే అతని దగ్గరివారు అందిన సమాచారం ప్రకారం, ఆ వ్యక్తి నిజంగానే టామ్ క్రూజ్ అని నిర్ధారించారు.

ఇక టామ్ క్రూజ్ రిస్క్ తాలూకు స్టంట్స్‌లో ఎప్పుడూ ముందుండే వ్యక్తి. తాజా చిత్రం  మిషన్ ఇంపాసిబుల్ – ది ఫైనల్ రెకనింగ్ ను క్రిస్టఫర్ మెక్వార్రీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అమెరికాలో మే 23న విడుదల కానుండగా, భారతదేశంలో ముందుగానే మే 17న విడుదల కానుంది. అలాగే, మే 14న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఔట్ ఆఫ్ కాంపిటిషన్ విభాగంలో ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్‌కు టామ్ క్రూజ్ మరియు ఇతర నటీనటులు హాజరయ్యే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో క్రూజ్‌తో పాటు హేలీ అట్వెల్, వింగ్ రహేమ్స్, సైమన్ పెగ్, ఏంజెలా బాసెట్, హెన్రీ సెర్నీ లాంటి ప్రముఖ నటీనటులు కూడా కనిపించనున్నారు.ఈ ఫిల్మ్ ప్రమోషన్‌లో భాగంగా టామ్ క్రూజ్ చేసిన ఈ తాజా స్టంట్, ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహం నింపుతోంది.

 

Read more Articles on