పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. ఇప్పటికే ఆయన `హరిహర వీరమల్లు` మూవీ షూటింగ్‌ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు `ఓజీ` మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించాల్సిన `ఓజీ`, `హరిహర వీరమల్లు` సినిమాల షూటింగ్‌లు చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న విషయం తెలిసిందే. షూటింగ్ స్టార్ట్ చేయాలని భావించినా,
ఏదో రూపంలో అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా పవన్ ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్‌లో పాల్గొనలేకపోతున్నారు. పలుమార్లు షూటింగ్ ప్లాన్ చేసి క్యాన్సిల్ చేసిన సందర్భాలున్నాయి.
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు షూటింగ్‌లు పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్. ఇప్పటికే `హరిహర వీరమల్లు` మూవీ షూటింగ్‌ని పూర్తి చేశారు. ఇది రిలీజ్ కావడమే ఆలస్యం. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.
మరోవైపు ఇప్పుడు మరో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. `ఓజీ` మూవీ నేటి( సోమవారం) నుంచి స్టార్ట్ చేశారు. ఈ మూవీ షూటింగ్‌లో పవన్ 15 నుంచి 20 రోజులు పాల్గొంటే చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందట.
ఈ క్రమంలో నేటి నుంచి చిత్రీకరణ ప్రారంభించారు. మరి ఇందులో పవన్ పాల్గొన్నాడా? ఎప్పుడు పాల్గొంటాడు అనేది ఆసక్తికరంగా మారింది. కానీ `ఓజీ` సినిమా రీ స్టార్ట్ అయ్యిందనే వార్త పవన్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందని చెప్పొచ్చు.
ఎందుకంటే ఫ్యాన్స్ అంతా ఈ మూవీ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇందులో పవన్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ పూనకాలు తెప్పించింది. ఇన్నాళ్లపాటు ఆ ఒక్క గ్లింప్స్ మాత్రమే ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ ని ఎంగేజ్ చేస్తుంది. సినిమాపై అంచనాలను ఏమాత్రం తగ్గకుండా చూస్తుంది.
ముంబయి మాఫియా నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని, ఇందులో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్‌గా పవన్ కనిపిస్తారని, ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, అభిమానులు పవన్‌ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఉంటుందని తెలుస్తుంది.
యాక్షన్ మాత్రమే కాదు, సెంటిమెంట్ కూడా మెయిన్‌గా ఉండబోతుందట. అదే సినిమాకి బలం అని, దాని చుట్టే సినిమా తిరుగుతుందని, సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయమని గతంలో ఇందులో కీలక పాత్రలో నటించిన శ్రియా రెడ్డి తెలిపింది.
ఇందులో పవన్ కళ్యాణ్‌తోపాటు ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంపైనే నిర్మాత, దర్శకులు ఆశలు పెట్టుకున్నారు. ఇక నేటి నుంచి ప్రారంభమైన షూటింగ్‌ని కంటిన్యూగా జరిపే అవకాశం ఉందని, త్వరలోనే కంప్లీట్ చేసి కుదిరితే ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. మరి అది సాధ్యమవుతుందా అనేది చూడాలి.
Malli Modhalaindi…. Eeesaari Mugiddaaam… pic.twitter.com/gvvsS3q2PQ
— DVV Entertainment (@DVVMovies)