అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా నేడు చాలా మంది మహిళలు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒడి) సమస్య బాధపడుతున్నారు.
పీసీఓడీ అనేది స్త్రీల అండాశయాలను ప్రభావితం చేసే హార్మోన్ల అసమతుల్యత.
క్రమరహిత ఋతుచక్రం, మొటిమలు, శరీరంపై అధిక రోమాలు, అధిక బరువు వంటివి పిసిఒడి సాధారణ లక్షణాలు.
పిసిఒడి ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహారాలు పిసిఒడి లక్షణాలను తీవ్రతరం చేస్తాయి.
పీసీఓడీ ఉన్నవారు తినకూడని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తెల్ల రొట్టె, పాస్తా, బేక్ చేసిన ఆహారాలు ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి, ఇది హార్మోన్ల పనితీరును ప్రభావితం చేస్తుంది.
వేపుళ్ళలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇవి బరువు పెరగడానికి, పిసిఒడి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి.
సోయా ఉత్పత్తులు హార్మోన్ల పనితీరును ప్రభావితం చేస్తాయి, కాబట్టి వాటిని తినకూడదు.
సోడా, ఎనర్జీ డ్రింక్స్ వంటి చక్కెర పానీయాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. బరువు పెరగడానికి దారితీస్తాయి.
పాలు, జున్ను తీసుకోవడం వల్ల పిసిఒడి ఉన్నవారిలో ఆండ్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి.
ప్రాసెస్ చేసిన మాంసం ఆరోగ్యానికి మంచిది కాదు. మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.