ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన విభిన్న చిత్రాలతో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఆయన సౌత్ ఇండియన్ సినిమాల్లో నటుడిగా విభిన్నమైన పాత్రాలు సొంతం చేసుకుంటున్నారు.
ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన విభిన్న చిత్రాలతో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఆయన సౌత్ ఇండియన్ సినిమాల్లో నటుడిగా విభిన్నమైన పాత్రాలు సొంతం చేసుకుంటున్నారు. 2018లో విడుదలైన తమిళ చిత్రం ఇమైక్కా నోడిగల్లో ప్రతినాయకుడిగా కనిపించిన అనురాగ్, ఇటీవల విజయ్ సేతుపతితో కలిసి నటించిన మహారాజా సినిమాలో తన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ తరుణంలో అనురాగ్ ఒక ఆసక్తికర విషయం పంచుకున్నారు. ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ, సౌత్ సినిమాల్లో నటించాలన్నది తనకు ముందుగా ఉన్న లక్ష్యం కాదని తెలిపారు. "ఇమైక్కా నోడిగల్ తర్వాత చాలానే దక్షిణాది చిత్రాల ఆఫర్లు వచ్చాయి, కానీ నేను తిరస్కరించాను. తర్వాత 'కెనెడీ' చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ సమయంలో, నా పొరుగువారి ఇంటిలో విజయ్ సేతుపతిని తరచూ కలుసుకునేవాడిని" అని చెప్పారు.
ఆ సంభాషణల్లో విజయ్ సేతుపతి తన వద్ద ఉన్న కథను అనురాగ్‌తో పంచుకున్నారు. మొదట అనురాగ్ ఆసక్తి చూపించకపోయినా, కెనెడీ చిత్రంలో విజయ్ ప్రోత్సాహంతో నటనలో తనకు కొత్తదనం కనిపించిందని చెప్పారు. "ఆ సినిమా కోసం ఆయనకు థ్యాంక్ యూ కార్డు కూడా ఇచ్చాను" అని అన్నారు.
అనురాగ్ మాట్లాడుతూ, ఒక సందర్భంలో విజయ్ సేతుపతితో తన కూతురు ఆలియా పెళ్లి గురించి మాట్లాడుతూ, "తర్వాత సంవత్సరం నా కూతురు పెళ్లి. ఆ ఖర్చులు భరించగలనో లేదో నాకు తెలియదు" అన్నానని తెలిపారు. దానికి విజయ్ స్పందిస్తూ, "మేము సహాయం చేస్తాం" అని చెప్పారు. ఆ చర్చ తర్వాతే మహారాజా చిత్రం ఏర్పడింది.
ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ పలు సౌత్ ఇండియన్ చిత్రాల్లో నటిస్తున్నారు. అదేవిధంగా అడివి శేష్తో కలిసి డెకాయిట్ అనే ద్విభాషా చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇప్పుడు దక్షిణాదిలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతోంది.