May 12, 2025, 5:45 PM IST
PM Modi Speech LIVE: ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగం లైవ్ అప్డేట్స్


PM Modi Speech LIVE: ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా సోమవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 'ఆపరేషన్ సింధూర్' కు సంబంధించిన మరింత సమాచారాన్ని ప్రధాని మోడీ దేశంతో పంచుకుంటారని భావిస్తున్నారు. ప్రధాని మోడీ ప్రసంగం లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడవచ్చు.
8:47 PM
PM Modi Speech LIVE: టెర్రర్ ఔర్ ట్రేడ్ ఏక్ సాథ్ నహీ చల్ సక్తే
PM Modi Speech LIVE: ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకపోతే పాకిస్తాన్‌ను అంతం చేస్తుంది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం కొనసాగిస్తే అది చివరికి దాని పతనానికి దారితీస్తుంది. పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం ఉగ్రవాదం వృద్ధి చెందడానికి ఎలా సహాయం చేస్తున్నాయో, అది ఒక రోజు పాకిస్తాన్‌ను అంతం చేస్తుంది. పాకిస్తాన్‌ను విడిచిపెట్టాలనుకుంటే, అది తన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను రద్దు చేయాలి. టెర్రర్ ఔర్ ట్రేడ్ ఏక్ సాథ్ నహీ చల్ సక్తే, పానీ ఔర్ ఖూన్ భీ ఏక్ సాథ్ నహీ బెహ్ సక్తే : ప్రధాని మోడీ
8:44 PM
PM Modi Speech LIVE: చర్చలు కేవలవం ఉగ్రవాదం, పీవోకేపై మాత్రమే..
PM Modi Speech LIVE: పాకిస్తాన్‌తో చర్చలు జరపాల్సి వస్తే అది కేవలం ఉగ్రవాదం, పీవోకేపై మాత్రమే జరుగుతాయి. పాక్‌కు పీవోకేను వదలడం తప్ప గత్యంతరం లేదు: ప్రధాని మోడీ
8:43 PM
PM Modi Speech LIVE: ఉగ్రవాదం, ఉగ్రవాదులను పోషిస్తున్న దేశాలను మేము వేరు వేరుగా చూడం
PM Modi Speech LIVE: ఉగ్రవాదులు దాడి చేస్తే మా పద్ధతిలో వారి మూలలను గుర్తించి అంతం చేస్తాం. న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేస్తే భారత్ సహించదు. ఉగ్రవాదం, ఉగ్రవాదులను పోషిస్తున్న దేశాలను మేము వేరు వేరుగా చూడం.. మా దృష్టిలో ఇద్దరు ఒక్కటే : ప్రధాని మోడీ
8:33 PM
PM Modi Speech LIVE: పాక్ మిస్సైల్స్ మన రక్షణ వ్యవస్థ ముందు తేలిపోయాయి
PM Modi Speech LIVE: పాకిస్తాన్ తో పాటు యావత్ ప్రపంచం మన దేశ శక్తిని మరోసారి చూసింది. పాక్ మిస్సైల్స్ మన రక్షణ వ్యవస్థ ముందు తేలిపోయాయి. పాకిస్తాన్ మిస్సైల్స్ భారత్‌లోకి రాలేకపోయాయి.. కానీ, మనం పాక్ గుండెల్లో బాంబులు పేల్చాం.. పాకిస్తాన్‌లోని ఎయిర్‌బేస్‌లను దెబ్బకొట్టాము. భారత్ దాడితో పాకిస్తాన్ ఆత్మరక్షణలో పడింది. సాయం కోసం ప్రపంచం వైపు చూసింది : ప్రధాని మోడీ
8:31 PM
PM Modi Speech LIVE: ఉగ్రవాదం పాకిస్తాన్ ను ఎప్పటికైనా నాశనం చేస్తుంది
PM Modi Speech LIVE: ఉగ్రవాదం పాకిస్తాన్ ను ఎప్పటికైనా నాశనం చేస్తుంది. ఇకనైనా పాక్ తీరును మార్చుకోవాలి. భారతీయ క్షిపణులు, డ్రోన్లు పాకిస్తాన్‌లోని ఉగ్ర ప్రదేశాలపై దాడి చేసినప్పుడు, ఉగ్రవాద సంస్థల భవనాలు మాత్రమే కాదు, వారి ధైర్యం కూడా బెబ్బతిన్నది. భావల్పూర్, మురిద్కే వంటి ఉగ్రవాద ప్రదేశాలు ప్రపంచ ఉగ్రవాద విశ్వవిద్యాలయాలు. 9/11 లేదా భారతదేశంలో జరిగిన పెద్ద ఉగ్రవాద దాడులతో సహా ప్రపంచంలోని అన్ని పెద్ద ఉగ్రవాద దాడులు ఏదో ఒక విధంగా ఈ ఉగ్రవాద ప్రదేశాలతో ముడిపడి ఉన్నాయి : ప్రధాని మోడీ
8:28 PM
PM Modi Speech LIVE: 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాము
PM Modi Speech LIVE: ఆపరేషన్ సింధూర్ తో 100 మంది కరడుకట్టిన ఉగ్రవాదులను భారత్ మట్టుబెట్టింది. మన ఐక్యమత్యమే మన బలం : ప్రధాని మోడీ
8:27 PM
PM Modi Speech LIVE: మన త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి
PM Modi Speech LIVE: మన సైన్యం, నావికాదళం, వైమానిక దళం, బీఎస్ఎఫ్ ఇలా అన్ని ఇతర దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాద, సైనిక మౌలిక సదుపాయాలపై మా ప్రతీకార చర్యను మేము ప్రస్తుతానికి నిలిపివేసాము. రాబోయే రోజుల్లో, పాకిస్తాన్ తీసుకునే ప్రతి అడుగును అది అనుసరించే విధానం, ప్రవర్తన ఆధారంగానే ఉంటుంది : ప్రధాని మోడీ
8:24 PM
PM Modi Speech LIVE: అణు బ్లాక్ మెయిల్ ను భారత్ సహించదు
PM Modi Speech LIVE: అణు బ్లాక్ మెయిల్ ను భారత్ సహించదు. న్యూ ఏజ్ వార్ లో కూడా మన సత్తా చూపించాం. పాకిస్తాన్ చర్యలను బట్టి మన చర్యలు ఉంటాయి. ఉగ్రవాదులు దాడులు చేస్తే ఇకపై ఆపరేషన్ సింధూర్ లాగే చర్యలు తీసుకుంటాం : ప్రధాని మోడీ
8:21 PM
PM Modi Speech LIVE: పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాం
పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాము. ఉగ్రదాడి తర్వాత దేశం ఒక్కటిగా నిలబడింది. మన సైన్యం తన పవర్ చూపిస్తూ ఉగ్రవాదులను క్షిపణులు, డ్రోన్‌లతో హతమార్చాయి. గ్లోబల్ టెర్రరిజానికి బహావల్పూర్ ఒక యూనివర్సిటీ. ఉగ్రవాదులపై భారత్ దాడులతో పాకిస్తాన్ ఎలా నడుచుకుందో యావత్ ప్రపంచం చూసింది : ప్రధాని మోడీ
8:18 PM
PM Modi Speech LIVE: భారత్ చర్యలతో పాక్ నిరాశ,నిస్పృహల్లో కూరుకుపోయింది
PM Modi Speech LIVE: ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదంపై పోరుమొదలుపెట్టాం. మన సైన్యం అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి ఉగ్రవాదులను మట్టుబెట్టింది. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలు ధ్వంసం చేసింది. రక్షణ దళాలు చేసిన సాహసం దేశానికి తలమానికంగా నిలిచింది : ప్రధాని మోడీ
8:16 PM
PM Modi Speech LIVE: పహల్గామ్ ఉగ్రదాడి నన్ను ఎంతో బాధించింది : ప్రధాని మోడీ
PM Modi Speech LIVE: పహల్గామ్ దాడితో ఉగ్రదాడులు పర్యాటకులను టార్గెట్ చేశారు. అత్యంత దారుణంగా కుటుంబసభ్యుల ముందే వారి ప్రాణాలు తీశారు. నన్ను ఇది ఎంతో బాధించింది. అత్యంత దారుణమైన విషయం. ఈ ఉగ్రవాద చర్యను దేశమంతా ఖండించింది. తర్వాత తగిన విధంగా మన పవర్ చూపించాము : ప్రధాని మోడీ
8:12 PM
PM Modi Speech LIVE: దేశమే ప్రథమం అనే విధంగా నిర్ణయం తీసుకున్నాం
PM Modi Speech LIVE: పహల్గామ్ ఉగ్రదాడిని యావత్ భారతావని ఖండించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాము. ఆపరేషన్ సింధూర్ తో భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది - ప్రధాని మోడీ
8:10 PM
PM Modi Speech LIVE: ఆపరేషన్ సింధూర్ న్యాయం కోసంచేసిన ప్రతిజ్ఞ
PM Modi Speech LIVE: ఆపరేషన్ సింధూర్ న్యాయం కోసంచేసిన ప్రతిజ్ఞ అని ప్రధాని మోడీ అన్నారు. ఉగ్రవాదులను అంతం చేసేందుకు మన ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని తెలిపారు. పాక్ లోని ఉగ్రస్థావారాలపై మన సైన్యం దాడులు చేసింది. ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
8:07 PM
PM Modi Speech LIVE: ఆపరేషన్ సింధూర్ ఒక పేరు కాదు..
PM Modi Speech LIVE: ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు కాదు. యావత్ భారతావనికి ఒక ఆవేదన. భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం.. దేశ ప్రజలందరి తరఫున భారత సైన్యానికి అభినందనలు - ప్రధాని మోడీ
8:04 PM
PM Modi Speech LIVE: పాక్ కు మరో మార్గం లేదు..
PM Modi Speech LIVE: పీవోకేను వదలడం తప్ప పాకిస్తాన్ కు మరో మార్గం లేదు - ప్రధాని మోడీ
8:03 PM
PM Modi Speech LIVE: ప్రధాని మోడీ ప్రసంగం ప్రారంభం
PM Modi Speech LIVE: మన బలగాలకు నా సెల్యూట్. ఆపరేషన్ సింధూర్ తో సహసోపేతమైన ప్రదర్శన ఇచ్చారు : ప్రధాని మోడీ
7:58 PM
PM Modi Speech LIVE: ప్రధాని మోడీ ఏం చెప్పబోతున్నారు?
PM Modi Speech LIVE: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోడీ మొదటి సారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రసంగం కావడంతో ప్రధాని ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.
7:37 PM
PM Modi Speech LIVE: భారత్-పాక్ డీజీఎంఓల మధ్య ముగిసిన నేటి చర్చలు
PM Modi Speech LIVE: భారత్, పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ సోమవారం చర్చలు జరిపారని వర్గాలు తెలిపాయి. ఇద్దరు DGMO ల మధ్య చర్చలు పూర్తయ్యాయని వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
5:53 PM
ఇండియా-పాకిస్తాన్ DGMO చర్చలు వాయిదా
మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన ఇండియా, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO)ల చర్చలు వాయిదా పడ్డాయి. ఈ చర్చలు సాయంత్రం జరుగుతాయని అంచనా.
5:53 PM
India Pakistan: పాకిస్తాన్ కాల్పుల విరమణ వెనుక అసలు కథ వేరే ఉందా?
India Pakistan: అణుబాంబులున్నాయని బెదిరిస్తూ వచ్చిన పాకిస్తాన్.. యుద్ధ విరామం కోసం అమెరికా కాళ్లుపట్టుకుందాం? దీని వెనుక అసలు కథ వేరే ఉంది! పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
5:52 PM
పాకిస్తాన్ బహుముఖ దాడులకు బ్రేక్ వేసిన భారత్ ఎయిర్ కమాండ్ సిస్టమ్
పాకిస్తాన్ దాడులను అడ్డుకునేలో భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కీలకంగా పనిచేసింది, ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు జరిపింది.
5:52 PM
india Pakistan: పాకిస్తాన్ అణు కేంద్రాలపై దాడి జరిగిందా? భారత సైన్యం ఏం చెప్పిందంటే?
india Pakistan: పాకిస్తాన్ అణ్వాయుధ నిల్వ కేంద్రం ఎక్కడుందో భారత సైన్యం చెప్పాల్సిన అవసరం లేదనీ, ముఖ్యంగా అది తెలియదని సైన్యం స్పష్టం చేసింది.
5:51 PM
PM Modi: కాసేపట్లో జాతిని ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోదీ.. ఎలాంటి ప్రకటన చేయనున్నారు?
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఆ ఉద్రిక్తలు శాంతించాయి. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారని తెలుస్తోంది. దీంతో ప్రధాని ఏం మాట్లాడనున్నారన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
5:51 PM
PM Modi Speech LIVE: భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం
India Pakistan Conflict: భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి 8 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 'ఆపరేషన్ సింధూర్' కు సంబంధించిన సమాచారాన్ని ప్రధాని మోదీ దేశంతో పంచుకుంటారని భావిస్తున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా దాడులు జరిగాయి. దీని తరువాత, పాకిస్తాన్ తీవ్ర భయాందోళనకు గురై భారతదేశంపై 400 కి పైగా డ్రోన్లను ప్రయోగించింది. అయితే, భారత వైమానిక రక్షణ దళాలు అన్ని డ్రోన్‌లను కూల్చివేసాయి. నాలుగు రోజుల సైనిక ఉద్రిక్తత తర్వాత, రెండు దేశాలు శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ప్రకటించాయి. ఆ తర్వాత కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.