ప్రముఖ దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి చాలా కాలం విరామం తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన తాజాగా ఒక ప్రత్యేకమైన సినిమాతో పునరాగమనాన్ని ప్రకటించారు.
ప్రముఖ దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి చాలా కాలం విరామం తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన తాజాగా ఒక ప్రత్యేకమైన సినిమాతో పునరాగమనాన్ని ప్రకటించారు. ఈ చిత్రంతో వైవిఎస్ చౌదరి ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన మరో తరం వారసుడు ను కథానాయకుడిగా పరిచయం చేస్తుండడం గమనార్హం. స్వర్గీయ ఎన్టీఆర్ మునిమనవడు ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అతడి పేరు కూడా నందమూరి తారక రామారావు కావడం విశేషం.
ఇదివరకే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వచ్చింది. కాగా నేడు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. కూచిపూడి నర్తకి వీణా రావు ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఈ యువ హీరో నందమూరి హరికృష్ణకి మనవడు. నందమూరి జానకిరామ్ తనయుడు అనే సంగతి తెలిసిందే. ఈ ముగ్గురి ఆశీస్సులు తనకి ఉంటాయని తారక రామారావు తెలిపారు.
ఈరోజు (సోమవారం) ఈ చిత్రానికి ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముహూర్తపు షాట్‌తో కలిసి అన్ని అధికారిక కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి తదితరులు హాజరయ్యారు. చిత్రబృందం పూర్తి ఉత్సాహంతో ఈ ప్రాజెక్ట్ పై పనిచేయనుంది.
ముహూర్తం షాట్ పై నారా భువనేశ్వరి క్లాప్ ఇచ్చారు. మా నాన్న ఎన్టీఆర్ గారి అంత ఎత్తు ఈ తారక రామారావు కూడా ఎదగాలి అని అభినందించారు. ఈ రోజు నందమూరి కుటుంబం నుంచి మరో తరం సినీ రంగంలోకి అడుగుపెడుతోంది. తారక రామారావు కళామతల్లి ఆశీస్సులతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు అని పురందేశ్వరి తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతాన్ని ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అందించనుండగా, పాటల సాహిత్యాన్ని మరో ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రాయనున్నారు. పటిష్ఠమైన డైలాగ్ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు అందించనున్నారు.
ఈ సినిమాను యలమంచిలి గీత నిర్మిస్తున్నారు. న్యూతాలెంట్ రోర్స్@ అనే ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి రమేష్ అత్తిలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమా వివరాలు, టైటిల్, ఫస్ట్ లుక్ తదితర వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన కొత్త అధ్యాయానికి ఈ చిత్రం నాంది పలకనుంది. ఎన్టీఆర్ వారసుడు కథానాయకుడిగా తెరపైకి రావడం, ప్రముఖ సాంకేతిక నిపుణులు భాగస్వామ్యం కావడంతో, ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.