16 ఏళ్లకే ఆ ఇమేజ్‌.. అందుకే సినిమాలు మానేశా: హీరోయిన్ హాట్ కామెంట్స్‌

First Published Jun 25, 2020, 9:59 AM IST

స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్‌ బ్యూటీ రియా సేన్‌ 16 ఏళ్ల వయసులోనే తొలి బ్రేక్‌ అందుకుంది. 1998లో రిలీజ్‌ అయిన ఫల్గొని పాతక్‌ మ్యూజిక్‌ వీడియో యాద్‌ పియా కి ఆనే లగి తో సక్సెస్‌ అందుకుంది.

నటి రియా సేన్‌ చిన్న వయసులోనే సెక్సీ ఇమేజ్ అందుకుంది. సినిమాలతో పాటు మ్యూజిక్ వీడియోస్‌లోనూ తనను అలాగే ప్రొజెక్ట్ చేయటంతో రియాసేన్ చాలా ఇబ్బందిగా ఫీల్‌ అయ్యింది. అందుకే ఈ బ్యూటీ పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఈ విషయాన్ని రియా స్వయంగా వెల్లడించింది.
undefined
స్టార్ వారసురాలిగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది రియాసేన్‌. రియా అమ్మమ్మ సుచిత్ర సేన్‌తో పాటు తల్లి మున్‌మున్‌ సేన్‌లు కూడా హీరోయిన్లుగా ఆకట్టుకున్నారు. అదే వారసత్వంతో రియా సేన్‌తో పాటు ఆమె సోదరి రైమా సేన్‌ కూడా వెండితెర మీద సందడి చేశారు.
undefined
బాలీవుడ్‌ బ్యూటీ రియా సేన్‌ 16 ఏళ్ల వయసులోనే తొలి బ్రేక్‌ అందుకుంది. 1998లో రిలీజ్‌ అయిన ఫల్గొని పాతక్‌ మ్యూజిక్‌ వీడియో యాద్‌ పియా కి ఆనే లగి తో సక్సెస్‌ అందుకుంది.
undefined
1999 లెజెండరీ దర్శకుడు భారతీ రాజా డైరెక్షన్‌లో తెరకెక్కిన తమిళ రొమాంటిక్ డ్రామా తాజ్ మహల్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చింది రియాసేన్‌. ఆ తరువాత బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ స్టైల్‌, జన్‌కార్‌ బీట్స్‌, ఖయామత్‌: సిటీ అండర్‌ త్రెట్‌ లాంటి సినిమాల్లో నటించింది.
undefined
బాలీవుడ్‌ లో అడుగుపెట్టిన కొత్తలో వరుస సూపర్‌ హిట్‌లు దక్కటంతో తన ఎంపిక కరెక్టే అని భావించిదట ఈ బ్యూటీ. అయితే అన్ని కమర్షియల్ సినిమాలు మాత్రమే కావటంతో ఆ సినిమాల ద్వారా రియా కేవలం బోల్డ్ హీరోయిన్‌ అన్న ఇమేజ్‌ మాత్రమే వచ్చింది.
undefined
అయితే అదే సమయంలో తనకు నటిగా గుర్తింపు రాకపోవటం తరుచూ విమర్శలు వినిపించటంతో అసలు విషయం అర్ధమైందని తెలిపింది రియా. సెక్సీ సీన్స్ చేయటంలో తాను ఇబ్బందిగా ఫీల్ అవ్వటం వల్లే తాను బాగా నటించలేకపోయానని తెలిపింది. అయితే ఈ విషయంలో తాను ఎవరినీ బ్లేమ్ చేయటం లేదని కూడా వెల్లడించింది రియా.
undefined
39 ఏళ్ల ఈ బ్యూటీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ తొలినాళ్లలో ఎదురైన అనుభవాల గురించి వెల్లడించింది. చిన్న వయసులోనే సెక్సీ బోల్డ్ అన్న ఇమేజ్‌ రావటం తనను ఎంతో ఇబ్బంది పెట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ కారణంగానే తాను సినిమాలకు దూరమైనట్టుగా తెలిపింది.
undefined
click me!