రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు.
ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.
రాశి ఖన్నా ఎప్పుడూ తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతూనే ఉంది. తాజాగా రాశి ఖన్నా కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. కలర్ఫుల్ అవుట్ ఫిట్ లో రాశి తన గ్లామర్ తో మెరుపులు మెరిపిస్తోంది.
స్టాండింగ్ ఫోజుల్లో అజంతా, ఎల్లోరా శిల్పాల తరహాలో హొయలు పోతున్న రాశి అందాలకు కుర్రాళ్ళు మైమరచిపోతున్నారు. యువత చూపు మొత్తం థైస్ పై పడేలా రాశి కవ్విస్తోంది.
రాశి ఖన్నా ఈ డ్రెస్ లో బార్బీ బొమ్మలా మత్తెక్కిస్తోంది. ఫుల్ బాటిల్ కిక్కి మొత్తం రాశి ఖన్నా సొగసులో ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చూపుతిప్పుకోలేని పరువాలతో రాశి ఖన్నా ఇంటెన్సిటీ పెంచేసింది.
రాశి ఖన్నా హోమ్లీగా, గ్లామర్ గా మెప్పించగల కొద్దిమంది నటీమణుల్లో ఒకరు. రెండు విధాలుగా కూడా ఆమె అనేక చిత్రాల్లో నటించింది. అలరిపిల్లగా, ఎమోషనల్ గా కూడా మెప్పించింది.
రాశి ఖన్నా గ్లామర్ పరంగా తిరుగులేనప్పటికీ విజయాల పరంగా వెనుకంజలోనే ఉంది. ఇటీవల విడుదలైన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి.
ఆ చిత్రాలతో ఏంజిల్ ఆర్నాకి నిరాశ తప్పలేదు. ప్రస్తుతం రాశి ఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. కొత్త హీరోయిన్ల హవా నేపథ్యంలో రాశి ఖన్నాకి పోటీ తప్పడం లేదు.