కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఇంకా థియేటర్లలో సందడి చేస్తుంది. అయితే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చింది.
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సూపర్ హిట్
శశికుమార్, సిమ్రాన్, యోగి బాబు, ఎం.ఎస్.భాస్కర్, రమేష్ తిలక్, కమలేష్, మిథున్ జయ్‌శంకర్ వంటి వారు నటించిన కోలీవుడ్ మూవీ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. మే 1న రిలీజ్ అయిన ఈ సినిమాకి భారీ స్పందన వచ్చింది. డైరెక్టర్ అభిషాన్ జీవింద్ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీలంక నుంచి వలస వచ్చిన ఒక తమిళ కుటుంబం ఎదుర్కొనే సమస్యలని కామెడీ, ఎమోషన్స్ తో చూపించారు.
75 కోట్లు వసూలు చేసిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’
నాలుగు వారాలు దాటినా ఈ మూవీ ఇంకా థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. రూ. 7 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా మూడు వారాల్లోనే రూ.75 కోట్లు వసూలు చేసిందని అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. ఇక ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ శుభవార్త రానే వచ్చింది.
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఓటీటీ రిలీజ్ డేట్
జూన్ 2న జియో హాట్ స్టార్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో త్వరలోనే ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఈ మూవీ అలరించబోతుందని చెప్పొచ్చు. మరి ఓటీటీలో దీనికి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.