ఎద అందాలను ఓపెన్‌గా చూపిస్తూ బన్నీపై క్రష్‌ రివీల్‌ చేసిన ప్రియాంక జవాల్కర్.. తన అందం సీక్రెట్‌ అదేనట

First Published Aug 10, 2021, 5:09 PM IST

బ్యాక్‌ టూ బ్యాక్‌ `తిమ్మరుసు`, `ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం`తో సక్సెస్‌లు కొట్టిన ప్రియాంక జవాల్కర్‌ ఆసక్తికర విషయాలను తెలిపింది. బన్నీపై ఉన్న క్రష్‌ని రివీల్‌ చేసింది. అదే సమయంలో తన గ్లామర్‌ సీక్రెట్‌ని కూడా బోల్డ్ గా చెప్పేసింది. 
 

షార్ట్ ఫిల్మ్స్ తో పాపులర్‌ అయిన ప్రియాంక జవాల్కర్‌.. విజయ్‌ దేవరకొండతో నటించిన `టాక్సీవాలా`తో పాపులర్‌ అయ్యింది. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. కొంత గ్యాప్‌తో ఇటీవల వారం గ్యాప్‌తో సత్యదేవ్‌తో `తిమ్మరుసు`, అలాగే `ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం` చిత్రాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఒకేసారి రెండు సినిమాలు విడుదల కావడంతో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది ప్రియాంక. 

తాజాగా మంగళవారం తన సక్సెస్‌ హ్యాపీనెస్‌ని, బ్యూటీ సీక్రెట్‌ని, బన్నీపై ఉన్న క్రష్‌ని వెల్లడించింది. అదే సమయంలో తాను ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలను బయటపెట్టింది ప్రియాంక. 

తన అందం సీక్రెట్‌ గురించి చెబుతూ మేకప్‌ వల్లే తాను అందంగా ఉన్నానని చెప్పింది. ఈ విషయం సోషల్‌ మీడియాలో ట్రోల్‌ కూడా అయ్యిందని గుర్తు చేసింది. అయితే అందంగా, నాజూగ్గా ఉండే క్రమంలో తను కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్టు చెప్పింది. 

తనకు థైరాయిడ్‌ ఉందని, దీంతో ఫేస్‌పై పింపుల్స్ వచ్చాయని, కాస్త బరువెక్కినట్టు చెప్పింది.  గ్లామర్ పై కొంత కేర్ తీసుకొని వెయిట్ లాస్ అయ్యానని, తానే స్వయంగా వంటలు ప్రిపేర్‌ చేసుకున్నానని తెలిపింది. వెయిట్‌ లాస్‌ అనేది పెద్ద ఛాలెజింగ్‌ విషయమని, చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది. 
 

తాను మోడల్‌ని కాదని, నటిగా నిరూపించుకోవాలనుకుంటున్నట్టు చెప్పింది. అందుకోసమే గ్యాప్‌ వస్తుందని, మర్చిపోయే పాత్రలు చేయాలనుకోవడం లేదని, ఈ విషయంలో గ్యాప్‌ వచ్చినా ఫర్వాలేదని వెల్లడించింది. 
 

ఇటీవల గ్లామర్‌ ఫోటోలు ట్రెండ్‌ అవడంపై ఆమె స్పందిస్తూ, కొన్ని ఫోటోలు వైరల్‌ అవుతుంటే చాలా సంతోషంగా ఉంటుందని, పాజిటివ్‌ కామెంట్లని బాగా ఎంజాయ్‌ చేస్తానని తెలిపింది. ఓ పాస్‌ఫోటో సైజ్‌ ఫోటో వైరల్‌ కావడం చాలా హ్యాపీగా ఉందని తెలిపింది. 
 

పాత్ర డిమాండ్‌ చేస్తే తాను అందాల ఆరబోతకి సిద్ధమే అని వెల్లడించింది. తనకంటూ పరిమితులు పెట్టుకోలేదని వెల్లడించింది. ఇలా ఇటీవల పంచుకున్న హాట్‌ ఫోటోలను సమర్ధించుకుందీ బ్యూటీ. 

తాను తెలుగమ్మాయిని అయినప్పటికీ తనకు మాత్రం బాగానే సినిమా ఆఫర్లు వస్తున్నాయని, మంచి స్క్రిప్ట్ కోసం వేచి చూస్తున్నట్టు తెలిపింది. దీంతోపాటు ఓటీటీ ఆఫర్లు కూడా వస్తున్నాయని, నచ్చితే చేస్తానని వెల్లడించింది. డాన్స్‌ నేర్చుకోవాలనుకుంటున్నట్టు తెలిపింది. తమిళంలో ఓ సినిమాకి సైన్‌ చేశానని, అది త్వరలో అనౌన్స్ మెంట్‌ ఉంటుందని, పలు బాలీవుడ్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌కి కూడా ఆడిషన్స్ జరుగుతున్నాయని వెల్లడించింది. ప్రస్తుతం నటిస్తున్న `గమనం` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పింది.

అల్లు అర్జున్‌ అంటే తనకు క్రష్‌ అని బోల్డ్ గా చెప్పింది. ఆయనతో కలిసి నటించాలని ఉందని, ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నానని చెప్పింది. విజయ్‌ దేవరకొండ సరదాగా ఉంటారని, తను చాలా హార్డ్ వర్కర్‌ అని తెలిపింది.

click me!