ఒక ప్రక్క గ్యాప్ ఇచ్చి పవన్ హీరోయిన్ పరువాల విందు... మత్తు చూపులతో కవ్విస్తున్న అను ఇమ్మానియేల్!

First Published Feb 6, 2023, 9:47 AM IST

అను ఇమ్మానియేల్ టైట్ బాడీ కాన్ డ్రెస్ లో దర్శనమిచ్చారు. హాట్ క్లీవేజ్ షోతో మెంటల్ తెప్పించారు. ఈ తేనె కళ్ళ సుందరి గ్లామర్ దాడికి కుర్రకారు కుదేలవుతున్నారు. 
 

Anu Emmanuel

ఒక్క హిట్ అంటూ లేడీ విక్రమార్కుడిలా పట్టు వదలకుండా యుద్ధం చేస్తుంది అను ఇమ్మానియేల్. ఆమె లెగ్ పవర్ ఏమిటో కానీ... నటించిన ప్రతి మూవీ ప్లాపే. కెరీర్ బిగినింగ్ లో నానికి జంటగా నటించిన మజ్ను మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. పవన్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ పక్కన ఛాన్స్ వచ్చినా ఆమె ఫేట్ మారలేదు.

Anu Emmanuel


గత ఏడాది ఊర్వశివో రాక్షసివో అంటూ ప్రేక్షకులను పలకరించింది. హీరో శిరీష్ తో విచ్చలవిడి రొమాన్స్ చేసింది. వీరి సిల్వర్ స్క్రీన్ కెమిస్ట్రీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. మొహమాటం లేకుండా నటించినా ఫలితం మాత్రం శూన్యం. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కమర్షియల్ గా ఆడలేదు. 

Anu Emmanuel

జయాపజయాలతో సంబంధం లేకుండా అనుకి ఆఫర్స్ ఉన్నాయి. రవితేజకు జంటగా రావణాసుర చిత్రం చేస్తున్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య హిట్స్ తో రవితేజ ఫుల్ ఫార్మ్ లోకి వచ్చాడు. దీంతో అను ఇమ్మానియేల్ ని ఆయన కాపాడతాడనే నమ్మకాలు పెరిగాయి. రవితేజ హ్యాట్రిక్ కొట్టి అను ఇమ్మానియేల్ కి హిట్ గిఫ్ట్ గా ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. 
 

అలాగే కార్తీకి జంటగా జపాన్ చిత్రంలో అను ఇమ్మానియేల్ నటిస్తున్నారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో జపాన్ తెరకెక్కుతుంది. ఈ రెండు చిత్రాల విజయాలపై అను ఇమ్మానియేల్ కెరీర్ ఆధారపడి ఉంది. రావణాసుర, జపాన్ కూడా పరాజయం పొందితే అను ఇమ్మానియేల్ పరిశ్రమ నుండి సర్దుకున్నట్లే. 


 అను  కెరీర్ ఇలా ఒడిదుడుకులతో సాగుతుండగా... ఎఫైర్ రూమర్స్ పెద్ద ఎత్తున వినిపించాయి. ఆ మధ్య  అల్లు శిరీష్ తో డేటింగ్ చేస్తున్నారన్న ప్రచారం సాగింది. ఇద్దరూ ముంబైలో మకాం పెట్టారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ రూమర్స్ పై అను ఇమ్మానియేల్ స్పందించారు. ఆ వార్తలు నా వరకు వచ్చాయి. మా అమ్మ గారు నాతో చెప్పారు. ఆమె న్యూస్ ఎక్కువగా ఫాలో అవుతారు. ఇలా వార్తలు వస్తున్నాయని అమ్మ చెప్పి బాధపడింది. నిజానికి ఊర్వశివో రాక్షసివో చిత్రానికి ముందు శిరీష్ ని కలిసిందే లేదు. ఆ చిత్ర పూజా సెరిమోని రోజు పరిచయమయ్యారు.
 

Anu Emmanuel


డైరెక్టర్ స్టోరీ నేరేట్ చేశాక... క్యారెక్టర్ డిస్కషన్ కోసం కాఫీ షాప్ లో కలిశాము. ఆ చిత్ర పాత్రలను గురించి, వాటిని ఎలా చేయాలి వంటి విషయాలు మాట్లాడుకున్నాము. ఒకరి తత్వం గురించి మరొకరం మాట్లాడుకోవడం, అర్థం చేసుకోవడం చేశాము. ఈ రోజుల్లో ఒక అమ్మాయి అబ్బాయి కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకుంటే చాలు ప్రేమ కథలు అల్లేస్తారు. 

Anu Emmanuel


అల్లు శిరీష్ తో నాకు స్నేహం ఉంది. ప్రేమించే చనువు కానీ, ఆకర్షణ కానీ లేదు. శ్రీ,సింధు పాత్రల్లో రియలిస్టిక్ గా కనిపించడానికి కష్టపడ్డాము. ఒక లవ్ మూవీలో నటించినా కూడా ఇలాంటి పుకార్లు సృష్టిస్తారు. నా పేరు సూర్య సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా నటించాను. అప్పటి నుండి అల్లు అరవింద్ ఫ్యామిలీతో నాకు పరిచయం ఉంది. 


అల్లు అరవింద్ గారు నేరుగా శిరీష్ తో ఎఫైర్ రూమర్స్ గురించి అడిగారు. ఈ గాసిప్స్ గురించి మాట్లాడుకుంటూ మేము బాగా నవ్వుకున్నాము, అని అను ఇమ్మానియేల్ చెప్పుకొచ్చింది. ఎలాంటి అనుభవం లేని నేను 13 సినిమాలో నటించడం చిన్న విషయం కాదన్న అను... తాను సక్సెస్ ఫుల్ హీరోయిన్ అని సమర్ధించుకున్నారు. 

click me!