మీరు ఎప్పుడైనా ఈ పానీపూరీ తిన్నారా..? ట్రై చేస్తే బిల్లు మోతె..

By Ashok kumar Sandra  |  First Published May 1, 2024, 7:03 PM IST

పానీపూరీ చూడగానే తినాలనిపిస్తుంది. కానీ ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటివి తినాలంటే  జేబు ఖాళీ అవుతుంది. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో ప్లేట్ పానీపూరీ ధర వింటే  షాక్ అవుతారు. 
 


పానీపూరీ.. భారతీయులకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ లో మొదటి స్థానంలో ఉంది. పానీపూరీ, గోల్గప్ప ఇతర రకాల పానీపూరీలను ప్రజలు తింటుంటారు. ఏ సమయంలోనైనా పానీపూరీకి నో అని చెప్పేవాళ్లు చాలా తక్కువ. కొన్ని రోజుల క్రితం, భారతీయ సంతతికి చెందిన మహిళ పానీపూరీని తయారు చేసి మాస్టర్‌చెఫ్ ఆస్ట్రేలియాలో జడ్జెస్ కి అందించినట్లు వార్తలు వచ్చాయి. పానీపూరీ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. విదేశాల నుంచి వచ్చే సెలబ్రిటీలు పానీపూరీ రుచి చూడకుండా ఉండరంటే తప్పులేదు. ఈ పానీపూరీ   భారతీయులకు ఎంత ఇష్టమంటే డబ్బు చెల్లించి తింటుంటారు. వీధి పక్కన 30 లేదా 60 రూపాయలకు దొరికే ఒక ప్లేట్ పానీపూరీ 100, 150 రూపాయలకి అమ్మితే.. కానీ ఒక ప్లేట్ పానీపూరీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే  నమ్మకంగా ఉంటుందా?

ఎయిర్ పోర్ట్  లోపల అన్ని ఆహారాలు ఖరీదైనవి. కానీ ఒక ప్లేట్ పానీపూరీ ఇక్కడ 333 రూపాయలకు అమ్ముతున్నారు...

Latest Videos

undefined

ముంబై ఎయిర్‌పోర్ట్ (mumbai airport )కి వెళ్లిన ఓ వ్యాపారవేత్త ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌లోని ఓ షాపులో  పానీ పూరీ ప్లేట్ రూ.333కి అమ్మడం చూసి ఆశ్చర్యపోయాడు. ముంబయి విమానాశ్రయంలోని ఓ ఫుడ్‌స్టాల్‌లో స్నాక్‌ కౌంటర్‌ ఫొటోను ఓ వ్యాపారవేత్త షేర్‌ చేశాడు.  ముంబై విమానాశ్రయంలో ఫుడ్ స్టాల్స్ ఖరీదైనవని నాకు తెలుసు. "కానీ ఇంత ఖరీదైనదని తెలియదు," షుగర్ కాస్మటిక్స్ సహ వ్యవస్థాపకుడు అండ్  COO కౌశిక్ ముఖర్జీ Xఖాతాలో ఈ పానీపూరి ఫోటోను షేర్ చేసారు. 

కౌశిక్ ముఖర్జీ Xపోస్ట్‌లో మూడు స్ట్రీట్  ఫుడ్ ఫోటోలను షేర్ చేసారు. మీరు అతని పోస్ట్‌లో పానీ పూరీ, దహీ పూరీ అండ్  సేవ్ పూరీల ఫోటోలో చూడవచ్చు. ఒక ప్లేట్‌కు ఎనిమిది పూరీలు ఉంటాయి. ఈ మూడు స్ట్రీట్  ఫుట్ ముందు రూ.333 అని రాసి ఉంది.

కౌశిక్ ముఖర్జీ చేసిన ఈ పోస్ట్ అతని X అకౌంట్లో  వైరల్‌గా మారింది. ఈ పోస్టుని యాభై ఐదు వేల మందికి పైగా లైక్ చేయగా, వేల మంది కామెంట్ చేశారు. ఈ భారతీయ స్ట్రీట్  ఫుడ్ ఇంత ఖరీదైన ధరకు అమ్మడం బాధాకరమని కొందరు అన్నారు. 

వీధిలో అమ్మే ఎనిమిది  పానీపూరీగల ప్లేటుకు నలభై నుంచి యాభై రూపాయలు మాత్రమే చెల్లిస్తాను. రెట్టింపు చేసినా వంద రూపాయలకు మించదు. ధర ఎందుకు అంత ఎక్కువ అని ఒక యూజర్  అడగగా  ఎయిర్‌పోర్ట్‌లోని స్టాల్స్ మెయింటెనెన్స్ కాస్ట్, మెయింటెనెన్స్, స్టాఫ్ రెమ్యూనరేషన్‌తో సహా అన్నింటికీ బిల్లులు కట్టాలని మరొకరు కామెంట్లో అన్నారు.

సోషల్ మీడియాలో ఎయిర్‌పోర్ట్ ఫుడ్ తరచుగా వార్తల్లో నిలుస్తుంది. కొద్ది రోజుల క్రితం ముంబై ఎయిర్‌పోర్ట్ రెస్టారెంట్‌లో దోస, మజ్జిగను రూ.600 నుంచి రూ.620కి విక్రయిస్తున్నారనే వార్త వైరల్‌గా మారింది. 
 

 

Real estate is expensive for food stalls at the CSIA Mumbai airport - but I didn’t know THIS expensive 👀 pic.twitter.com/JRFMw3unLu

— Kaushik Mukherjee (@kaushikmkj)
click me!