లెదర్ డ్రెస్ లో బిగువైన పరువాలతో దడ పుట్టిస్తున్న ఐటం బాంబ్ మలైకా అరోరా... కుర్ర ప్రియుడు కోసమేనా అంటూ..

First Published Oct 20, 2021, 2:00 PM IST

ఆల్మోస్ట్ అర్థ సెంచరీకి దగ్గరైన మలైకా అరోరా... థర్టీ ప్లస్ లో ఉన్న అర్జున్ కపూర్ తో సాగిస్తున్న అందరికీ తెలిసిన ప్రేమాయణం. ఈ ఆడ్ పెయిర్ రొమాన్స్ లో మాత్రం పర్ఫెక్ట్ పెయిర్ అనిపించుకుంటున్నారు. 

ఐటెం భామగా బాలీవుడ్ తెరపై Malaika చేసిన రచ్చ, క్రియేట్ చేసిన చరిత్ర... ఎప్పటికీ నిలిచిపోతుంది.దిల్ సే చిత్రంలోని  'చెయ్య చెయ్య.. చెయ్యా..' ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దబాంగ్ సినిమాలోని... మున్నీ బద్నాం హుయీ.. సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఊపేసింది.

తెలుగులో Mahesh అతిథి, పవన్ గబ్బర్ సింగ్ చిత్రాలలో మలైకా స్పెషల్ సాంగ్స్ లో నటించారు. Gabbar singh సినిమాలోని కెవ్వు కేక సాంగ్  బాగా పాప్యులర్ అయ్యింది. ఆ విధంగా తెలుగు ప్రేక్షకులకు కూడా తన అందాల రుచి చూపించింది.

ఇక మలైకా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే... సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ని 1998లో వివాహం చేసుకుంది. అనంతరం 2017లో అధికారికంగా విడాకులు తీసుకొని విడిపోయారు. వీరి విడాకులకు కారణం, అర్జున్ కపూర్ తో మలైకా నెరిపిన అఫైర్ అని సమాచారం. 

దాన్ని నిజం చేస్తూ ప్రస్తుతం Arjun kapoor, మలైకా ప్రేమ పక్షులుగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. దాదాపు 18ఏళ్ళు తనకంటే చిన్నవాడితో మలైకా అఫైర్ నడపడం బాలీవుడ్ జనాలకే షాక్ ఇస్తుంది. మలైకాకు టీనేజ్ సన్ అర్హన్ ఖాన్ ఉన్నాడు. ఆమె సంరక్షణలోనే అతడు పెరుగుతున్నాడు. 

మోడల్ గా మలైకాకు ఫుల్ డిమాండ్ ఉంది. దీనితో ఆమె సంపాదన కోట్లలో ఉంది. అందమైన శరీరం కోసం మలైకా చాలా కష్టపడతారు. యోగాసనాలు, కఠిన కసరత్తుల ద్వారా వయసు కనబడకుండా ఫిట్ బాడీ మైంటైన్ చేస్తారు. 

తాజాగా మలైకా లెదర్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ హాట్ ఫోజులిచ్చారు. ఆమె బిగువైన పరువాలు కుర్రకారుకు దడపుట్టించేలా ఉన్నాయి. మలైకా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ కాగా, సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Also read ట్రాన్ఫ్స రెంట్‌ శారీలో సెగలు రేపుతున్న పూజా హెగ్డే.. అందరు హీరోలకు లక్కీ ఛార్మ్ అంటూ బన్నీ ప్రశంసలు

Also read హాట్‌ షోలో రెచ్చిపోయిన నిధి అగర్వాల్‌.. పోగుల్లాంటి డ్రెస్‌లో క్లీవేజ్‌ అందాలను చూస్తే చెమటలు పట్టాల్సిందే

click me!