అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలో కుర్చీ తాత... ఆ రోల్ ఊహించుకుంటేనే గూస్ బంప్స్!

First Published Jan 9, 2024, 9:08 AM IST


తెలుగు రాష్ట్రాల్లో కుర్చీ తాత పిచ్చ ఫేమస్ అయ్యాడు. ఏకంగా మహేష్ బాబు మూవీలో ఆయన ఐకానిక్ డైలాగ్ వాడారు. తాజాగా అల్లు అర్జున్ మూవీలో ఛాన్స్ కొట్టేసినట్లు కుర్చీ తాత చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

కుర్చీ తాత గా పాపులర్ అయ్యాడు షేక్ అహ్మద్ పాషా. ఒక్క డైలాగ్ ఆయన్ని సోషల్ మీడియా స్టార్ చేసింది. లేచిపోయి పెళ్లి చేసుకున్న షేక్ అహ్మద్ పాషా భార్యను అన్నదమ్ములు తీసుకుని వెళ్లారు. భార్యను ఇంటికి తెచ్చుకోవడానికి వెళితే బామ్మర్ది గడ్డపార తీసుకుని మీదకు వచ్చాడట. కుర్చీని మడతపెట్టి కొడితే బామ్మర్ది మెడలు విరిగిపోయాయట. 

షేక్ అహ్మద్ పాషా చెప్పిన కుర్చీ మడతపెట్టి డైలాగ్ వైరల్ అయ్యింది. షేక్ అహ్మద్ పాషా కాస్త కుర్చీ తాత అయ్యాడు. తర్వాత పలు ఇంటర్వ్యూలలో కుర్చీ తాత మాట తీరు, యాటిట్యూడ్ కి జనాలు కనెక్ట్ అయ్యారు. 
 

Latest Videos



ఇక మహేష్ బాబు గుంటూరు కారం మూవీలో కుర్చీ తాత రిఫరెన్స్ వాడాడు. అంత పెద్ద స్టార్ హీరో మూవీలో కుర్చీ తాత డైలాగ్ వాడటం ఊహించని పరిణామం. 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ విశేష ఆదరణ పొందింది. దీంతో కుర్చీ తాత గురించి మరికొంత మందికి తెలిసింది. 
 


కాగా కుర్చీ తాత కు సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయట. అల్లు అర్జున్ మూవీ ఛాన్స్ వచ్చిందని కుర్చీ తాత స్వయంగా చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కుర్చీ తాతను మీకు సినిమా ఆఫర్స్ వస్తున్నాయట కదా? అని అడిగితే... అవును అన్నారు. 
 

Kurchi Thatha

ఫిబ్రవరి నెలలో అల్లు అర్జున్ తో షూట్ ఉండొచ్చు. ఉండకపోవచ్చు. ఒక ఆఫర్ అయితే ఉందని చెప్పాడు. ఆ దేవుడు దయ, మీ ఆస్సీసులతో అల్లు అర్జున్ మూవీలో ఛాన్స్ ఓకే అయితే బాగుండు అన్నాడు.  ఆఫర్ అయితే కన్ఫర్మ్ అయినట్లు చెప్పలేదు. 
 

ఫిబ్రవరిలో షూట్ అంటే అది ఖచ్చితంగా పుష్ప 2 మూవీనే అయి ఉంటుంది. ఒకవేళ పుష్ప 2లో కుర్చీ తాత ఉంటే ఆ రోల్ మామూలుగా ఉండదు. సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన కాసేపు గూస్ బంప్స్ అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. మరి చూడాలి కుర్చీ తాత పుష్ప 2లో నటిస్తారో లేదో... 

మరోవైపు కుర్చీ తాత భిక్షాటన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆర్టీసీ బస్, వరంగల్ బస్టాండ్ లో కుర్చీ తాత అడుక్కుంటున్నాడని వార్తలు వచ్చాయి. 

click me!