Actress Radhika Sarathkumar : ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ మలయాళ సినిమా లొకేషన్ లో నటీమణుల నగ్న దృశ్యాలను బంధించడానికి రహస్య కెమెరాను ఉపయోగించడంపై షాకింగ్ విషయాలు వెల్లడించారు. రహస్యంగా చిత్రీకరించిన సన్నివేశాలను తరువాత సెట్లో పురుషులు చూస్తూ ఆనందించడం షాక్ కు, భయానికి గురిచేసిందని రాధిక చెప్పారు.
Actor Radhika Sarathkumar : ప్రముఖ నటి రాధిక శరత్‌కుమార్ తాను అనుభవించిన దారుణ సంఘటన గురించి వెల్లడిస్తూ షాకింగ్ విషయాలు ప్రస్తావించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మళయాల సినీ పరిశ్రమను షేక్ చేస్తున్నాయి. రహస్య కెమెరాల గురించి ఆమె చేసిన కామెంట్స్ భారత సినీ పరిశ్రమలో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అసలు రాధిక శరత్ కుమార్ ఏం చెప్పారు? మలయాళ సినిమా సెట్స్‌లోని క్యారవాన్లలో రహస్య కెమెరాలు ఉంచుతున్నారని నటి రాధిక శరత్‌కుమార్ షాకింగ్ ఆరోపణలు చేశారు. కారవాన్‌లో నటీమణుల ఫోటోలు రహస్యంగా తీస్తున్నారని రాధిక ఆరోపించింది. ఒక ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ.. సినీ సెట్, క్యారవాన్లలో హిడెన్ కెమెరాలు పెట్టి, నటీమణుల ఫొటోలను తీసుకునే వారు. అక్కడి పురుష సిబ్బంది ఈ దృశ్యాలను పంచుకుని వారి మొబైల్ ఫోన్‌లలో చూస్తూ ఆనందించడం చూశానని చెప్పారు. ఇది తనను చాలా భయాందోళనకు గురిచేసిందని తెలిపారు. ఆ భయంతోనే లొకేషన్‌లో కారవాన్‌ను ఉపయోగించడం మానేశానని రాధిక వెల్లడించింది.
‘‘నేను 46 ఏళ్లుగా ఈ రంగంలో పనిచేస్తున్నాను. అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించే ప్రయత్నం చేసిన వారు చాలా మంది ఉన్నారు. ఆడపిల్లలు 'నో' చెప్పడం నేర్చుకోవాలి. దీనిపై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు అంతా అమ్మాయిల తప్పు అనేలా చేస్తున్నారు. నేను చాలా మంది నటీమణుల తలుపులు తట్టడం చూశాను, ఎంతో మంది అమ్మాయిలు నా గదికి వచ్చి సహాయం చేయమని అడిగారు. కేరళలో నేను చూసినవి చెబుతాను. నేను నడుస్తున్నప్పుడు, చాలా మంది కలిసి ఒక వీడియో చూస్తున్నారు. అతను ఏమి చూస్తున్నాడని నేను ఒకరిని అడిగాను. దుస్తులు మార్చుకునే అమ్మాయిల వీడియోలు, చిత్రాలు చూస్తున్నారని తెలుసుకున్నాను. ప్రతి క్యారవాన్‌లో రహస్య కెమెరాతో చిత్రీకరించారు. నటీమణుల పేర్లతో కూడిన ఫోల్డర్‌ను సెర్చ్ చేస్తే వీడియో దొరుకుతుందని అన్నారు. అయితే, ఇది ఏ సినిమా లొకేషన్ లో జరిగిందో చెప్పను కానీ, తర్వాత కారవాన్‌లో వెళ్లేందుకు కూడా భయపడ్డాను' అని రాధిక అన్నారు.
undefined
"కొంతమంది పురుషులు మొబైల్ ఫోన్ చుట్టూ గుమిగూడి ఈ దృశ్యాలను చూసి ఆనందిస్తున్నట్లు నేను స్వయంగా చూశాను. నేను భయపడి, కారవాన్‌లో దుస్తులు మార్చుకోకుండానే హోటల్ రూమ్‌కి వెళ్లిపోయాను" అని రాధిక చెప్పారు. రాధిక చెప్పిన దాని ప్రకారం, కొంతమంది వ్యక్తులు కారవాన్‌లో కెమెరాను అమర్చి, నటీమనులకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా వారి నగ్న దృశ్యాలను చిత్రీకరించారు. ఈ దృశ్యాలను వారి మొబైల్ ఫోన్‌లలో వేర్వేరు ఫోల్డర్‌లలో సేవ్ చేశారు. ప్రతి ఫోల్డర్‌కు సంబంధిత నటి పేరు పెట్టారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆమె మిగిలిన షూటింగ్ కోసం కారవాన్‌లో దుస్తులు మార్చుకోకూడదని నిర్ణయించుకుంది.
రాధిక ఈ విషయాలు వెల్లడించిన తర్వాత WCC సభ్యురాలు డీడీ దామోదరన్ మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుగా సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తరపున ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. "ఒక సీనియర్ నటి ఈ ఆరోపణలతో ముందుకు వచ్చారు. ఈ సాక్ష్యాలు ప్రభుత్వానికి నాలుగున్నర సంవత్సరాలుగా ఉన్నాయి, కానీ కమిటీ నివేదికపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం మేల్కొని చర్య తీసుకోవడానికి ఇంకా ఎన్ని సాక్ష్యాలు అవసరం? నివేదికను బయటకు తీసుకురావడానికి మేము చాలా కష్టపడ్డాము, కానీ ఇప్పటికీ ఏమీ ముందుకు సాగడం లేదు. కారవాన్లలో రికార్డింగ్ ఇప్పటికీ జరుగుతోందనే ప్రాథమిక అవగాహన ఉండాలి. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి" అని డీడీ దామోదరన్ డిమాండ్ చేశారు.
అయితే, డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి, రహస్య కెమెరా సంఘటనపై రాధిక శరత్‌కుమార్ చాలా కాలం మౌనంగా ఉండటంపై ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎందుకు చెప్పకుండా ఉన్నారని ఆడిగారు. చెన్నై నగరంలో అత్యంత పలుకుబడి ఉన్న వ్యక్తుల్లో రాధికా శరత్ కుమార్ ఒకరు. కేరళ, తమిళనాడు చిత్ర పరిశ్రమలో ఆమె ప్రభావం ఎంతో ఉంది. నాపై కాకుండా మరికొంత మంది మహిళలపై ఇలాంటి నేరం జరుగుతుంటే ఇలాంటి విషయాలను వారు దాచాలని ఎందుకు అనుకున్నారు. మీరు షూ తో కొట్టాలని నేను అనడం లేదు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వారి మౌనం నేరాలకు దారి తీయలేదా? బయటి ప్రపంచానికి ఎందుకు చెప్పలేదు? మీరు మాట్లాడటం ద్వారా ఈ ప్రపంచంలోని పురుషులందరినీ సరిదిద్దగలరని మీరు అనుకుంటున్నారా? చట్టపరమైన చర్యల ద్వారానే ప్రతి ఒక్కరినీ సరిదిద్దగలం. మాకు కారవాన్ వద్దు అని చెప్పే ధైర్యం ఉండాలి. సినిమా అనేది చాలా దగ్గరి సంబంధం ఉన్న రంగం. ఒక కారవాన్ లోపల స్త్రీపురుషులు కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, ఆహారం తీసుకుంటూ, మాదకద్రవ్యాలు కూడా వాడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు?" అని అన్నారు.