రోజూ పరిగడుపున తులసి వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published Sep 5, 2024, 4:06 PM IST

 ఎంతో పవిత్రమైనదిగా భావించే తులసి  మొక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది ఎన్నో వ్యాధులను తగ్గిస్తుంది. అయితే మీరు ప్రతిరోజూ ఉదయం పరిగడుపున తులసి వాటర్ ను తాగితే ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారు. 

తులసి మొక్కను హిందూ మతంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. పెళ్లైన ఆడవారు ఈ మొక్కను రోజూ పూజిస్తారు. అయితే మనం రోజూ పూజించే ఈ మొక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ మొక్క వ్యాధులకు నివారిణిగా కూడా పనిచేస్తుంది.

అందుకే చాలామంది తమ ఇంట్లో ఈ మొక్కను ఖచ్చితంగా పెంచుకుంటుంటారు. ముఖ్యంగా తులసి ఆకులు జలుబు, దగ్గు సమస్యలను చాలా తొందరగా తగ్గిస్తుంది. అలాగే మనకున్న ఎన్నో సమస్యలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. 

ఎన్నో లాభాలున్న ఈ తులసి ఆకులను నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తాగితే మన  ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. అసలు ఈ  తులసి వాటర్  మన శరీరానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

తులసి నీటి ఆరోగ్య ప్రయోజనాలు

రోజూ తులసి ఆకులను తినడం వల్ల మన శరీరం శుభ్రపడుతుంది. అంతేకాదు మన శరీర ఉష్ణోగ్రత కూడా  నియంత్రణలో ఉంటుంది. అలాగే తులసి ఆకులు మన  శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా చేయడానికి తులసి వాటర్ బాగా ఉపయోగపడుతుంది. తులసి ఆకులతో చేసిన కాషాయం తాగితే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

అలాగే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు చాలా తొందరగా తగ్గుతాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో కొన్ని తులసి ఆకులను తింటూ తింటే కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

Latest Videos


తులసి నీటి ఆరోగ్య ప్రయోజనాలు

ఉదర సమస్యకు తులసి ఆకులను ఎలా ఉపయోగించాలి? 

కడుపు నొప్పి సమస్య ఉంటే.. కొబ్బరి నీళ్లలో తులసి ఆకుల రసం, నిమ్మరసం వేసి బాగా కలుపుకుని తాగితే  నొప్పి తొందరగా తగ్గిపోతుంది.

అలాగే అసిడిటీ సమస్యను కూడా తులసి ఆకులతో తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు లేదా మూడు తులసి ఆకులను బాగా నమిలి తినండి, దీనివల్ల తొందరగా ఫలితాన్ని పొందుతారు. 

సీజనల్ వ్యాధులు రాకుండా ఉండటానికి ఏం చేయాలి?

రుతుపవన వ్యాధులు, జీర్ణ సమస్యలు రాకుండా ఉండటానికి టీ లో కొన్ని తులసి ఆకులను వేసి మరిగించి వడకట్టి తాగండి. దీనివల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే తులసి రసం, ఆకులను తీసుకుంటే కూడా మీకు ఏ వ్యాధులు రాకుండా ఉంటాయి. 

తులసి నీటి ఆరోగ్య ప్రయోజనాలు

తులసి నీటి ప్రయోజనాలు :

జలుబు, దగ్గు గొంతు నొప్పి నుంచి ఉపశమనం : వర్షాకాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు రావడం చాలా సహజం. కానీ వీటివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. అయితే ఇవి తగ్గాలంటే తులసి నీటిని ప్రతిరోజూ ఉదయాన్నే పరిగడుపున తాగండి. చాలా తొందరగా తగ్గిపోతాయి.

డయాబెటిస్ రోగులకు మంచిది : తులసి వాటర్ డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిదంటారు నిపుణులు. ఎందుకంటే ఈ నీటిని రెగ్యులర్ గా తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మీరు సహజ పద్దతిలో బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయాలనుకుంటే తులసి వాటర్ ను తాగండి. 

జ్వరానికి మంచిది : వర్షాకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ జ్వరం బారిన పడుతుంటారు. అయితే మీరు ఈ సీజన్‌లో ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి వాటర్ ను తాగితే  మీకు ఎలాంటి అంటువ్యాధులు అంటుకోవు. జ్వరం కూడా తొందరగా తగ్గిపోతుంది. 

తులసి నీటి ఆరోగ్య ప్రయోజనాలు

నోటి దుర్వాసనను తగ్గిస్తుంది : తులసి ఆకులో ఉండే లక్షణాలు నోటి దుర్వాసనను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి నీళ్లను మీ నోరు ఎప్పుడూ తాజాగా ఉంటుంది.

జీర్ణక్రియకు మంచిది : ప్రతిరోజూ ఉదయాన్నే పరిగడుపున తులసి నీళ్లను తాగితే ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. దీనివల్ల జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. అలాగే మీ కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది : తులసి వాటర్ జీర్ణక్రియకు చాలా మంచిది. ఈ నీళ్లను రోజూ ఉదయాన్నే  పరిగడుపున తాగితే మీ మెటబాలిజం నియంత్రణలో ఉంటుంది.దీనివల్ల మీరు హెల్తీ బరువును మెయింటైన్ చేయగలుగుతారు. 

తులసి నీటి ఆరోగ్య ప్రయోజనాలు

తులసి వాటర్ ను ఎలా తయారుచేయాలి? తులసి నీళ్లను తయారుచేయడానికి ముందుగా ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టండి. దాంట్లో  2 కప్పుల నీళ్లను పోయండి. 

తర్వాత దాంట్లో కొన్ని తులసి ఆకులను వేసి దాదాపు మూడు నిమిషాల పాటు బాగా మరిగించండి. ఆ తర్వాత గిన్నెను దించి నీళ్లను చల్లారనివ్వండి. ఈ వాటర్ ను వడకట్టి గోరువెచ్చగా లేదా చల్లగా అయిన తర్వాత తాగండి. 

click me!