గోపీచంద్ ఇప్పుడు `విశ్వం` అనే మూవీతో రాబోతున్నాడు. టీజర్‌ని చూస్తుంటే అందులో తనపైనే తాను వేసుకున్న సెటైర్ హైలైట్‌గా నిలచింది.
మ్యాచో స్టార్ గోపీచంద్ కి ఈ మధ్య టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సినిమాలన్నీ బోల్తా కొడుతున్నాయి. రొటీన్ కమర్షియల్ సినిమాలతో వస్తూ బోల్తా పడుతున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ ఆయనకు థియేటర్‌లో చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల ఆయన రూట్ మార్చారు. ట్రెండ్‌ని పట్టుకుంటున్నాడు. సక్సెస్ కొడుతున్నాడు. ఇటీవల ఆయన `భీమా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ మూవీ పెద్ద హిట్ కాకపోయినా ఓ మోస్తారుగా బాగానే ఆడింది.
ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నారు. `విశ్వం` పేరుతో సినిమా చేశాడు. శ్రీను వైట్ల దీనికి దర్శకత్వం వహించడం విశేషం. కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం ఫన్నీగా సాగింది. చివర్లో గోపీచంద్ మార్క్ యాక్షన్ మేళవించారు. అదే సమయంలో ఆడియెన్స్ పై, ట్రోలర్స్ పై సెటైర్లు పేల్చడం విశేషం.
ఇక టీజర్‌లో.. ప్రారంభంలో నరేష్, ప్రగతి భార్యాభర్తలు. వీరి కూతురు కావ్యా థాపర్. ఆమెకి పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. శ్రీనివాస్ రెడ్డి పెళ్లిళ్ల బ్రోకర్. బంగినపండు లాంటి మా అమ్మాయికి కుర్రాడిని వెతికి పెట్టాలని నరేష్ చెబుతాడు. నీకు ఎలాంటి అబ్బాయి కావాలని తల్లి అని కావ్యాని అడగ్గా, కనపడగానే మీద పడిపోవాలి, నైట్ అంతా మెలుకువగా ఉండాలని చెప్పడం క్రేజీగా ఉంది. దీంతో వెన్నెల కిశోర్‌ని, అనంతరం గోపీచంద్‌ని పరిచయం చేశారు.
గోపీచంద్.. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. అది బర్నింగ్ ఎమోషన్ అని హీరోయిన్తో చెబుతాడు. అంతలోనే చెప్పరా నీ అబ్బా అని నరేష్.. గోపీచంద్‌పై ఫైర్ కావడం, ఇలా వరుసగా విలన్లు, కమెడియన్లు అంతా గోపీచంద్‌ని నీ అబ్బా అంటూ తిడుతుంటారు. అందరికి వాయించేస్తారు గోపీచంద్. చివరికి నరేష్‌కి కూడా చెంప పగిలిపోతుంది. అనంతరం సినిమాలోని పాత్రలన్నింటిని చూపించారు.
ఇక విదేశీ లొకేషన్‌లో.. ఇండియా అప్పుల్లో రెండో స్థానంలో ఉండటానికి కారణం.. మోసం, తప్పుల్లో ఐదో స్థానంలో ఉండటానికి కారణం మోసం.. నేను ఇక్కడ ఉండటానికి కారణం.. మోసం అని చెప్పడం నవ్వులు పూయించేలా ఉంది. ఇలా వెన్నెల కిశోర్, నరేష్, ప్రగతి ల కామెడీ సీన్లు చూపించారు. అనంతరం టీజర్ యాక్షన్ వైపు టర్న్ తీసుకుంది. ప్రత్యర్థులను చావగొట్టాడు గోపీచంద్. చివరగా కొట్టారు తీసుకున్నాం. రేపు మాకు టైమ్ వస్తుంది మేమూ కొడతాం అని గోపీచంద్ చెప్పడం హైలైట్ గా నిలిచింది. ఫన్, యాక్షన్ మేళవింపుగా టీజర్ సాగింది.
టీజర్ ఆకట్టుకునేలా ఉంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. హిలేరియస్ కామెడీ సినిమాకి పెద్ద అసెట్ కాబోతుందని తెలుస్తుంది. ఇటీవల కాలంలో గోపీచంద్ నుంచి ఇలాంటి సినిమాలు మిస్ అయ్యాయి. మొత్తంగా ఇన్నాళ్లకి ఆయన ట్రాక్‌లో పడ్డారనిపిస్తుంది. ఈ సినిమా హిట్ అయితే ఆయన సరైన ట్రాక్‌లోనే వెళ్తున్నారని చెప్పొచ్చు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేయబోతున్నారు.