ఆ డైరక్టర్ అత్యాచారం, ఏడాదికి పైగా నరకం : నటి సంచలన ఆరోపణలు

First Published | Sep 5, 2024, 4:07 PM IST

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక దర్శకుడిని ఉద్దేశించి నటి సౌమ్య కీలక ఆరోపణలు చేశారు. 

Sowmya, Tamil Director, Sexual Assault

హేమ కమిటీ రిపోర్ట్ ఇప్పుడు కేవలం మళయాళ చిత్ర పరిశ్రమకే పరిమితం కావటం లేదు. ప్రతీ చిత్ర పరిశ్రమలోనూ ఇప్పుడు హేమ కమిటి భయం పట్టుకుంది. మిగతా చిత్ర పరిశ్రమలలోనూ హీరోయిన్స్ ,నటులు బయిటకు వచ్చి హేమ కమిటి వేయాలని కోరుతున్నారు.

అంతేకాకుండా నటులు చాలా మంది తమ చేదు అనుభవాలను మీడియా ముందుకు వచ్చి షేర్ చేస్తున్నారు. తాజాగా తమిళ నటి సౌమ్య సైతం తమ జీవితంలో చోటు చేసుకున్న అత్యంత దారుణమైన అనుభవాలను చెప్పకొచ్చారు.

Hema commitee report

 వివరాల్లోకి వెళితే..హేమ కమిటీ రిపోర్ట్ (hema committee report) మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న తరుణంలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక దర్శకుడిని ఉద్దేశించి నటి సౌమ్య కీలక ఆరోపణలు చేశారు.

ఆ దర్శకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు. కూతురని పిలుస్తూనే నీచంగా ప్రవర్తించాడని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


crime bundi

సౌమ్య మాట్లాడుతూ... ‘‘అప్పుడు నాకు 18 సంవత్సరాలు. నేను కాలేజీలో ఫస్ట్ ఇయిర్ చదువుతున్నాను. మంచి కుటుంబనేపధ్యం నుంచి వచ్చాను. మా అమ్మా నాన్నలకు అసలు సినిమా పరిశ్రమ గురించి ఏమీ తెలియదు.

ఈ క్రమంలో కాలేజీలో నాటక పోటీ ప్రదర్శనలో ద్వారా నాకు సినిమాల్లో అవకాసం వచ్చింది. ఓ తమిళ దర్శకుడు నన్ను సంప్రదించారు. నాకు సిని పరిశ్రమలో ఉన్న ప్రమాదాలు గురించి తెలియదు.

నేను మా ఇంటికి దగ్గరలో ఉంటే నటి రేవతి అంటే చాలా ఇష్టపడేదాన్ని. నేను ఓ కలల ప్రపంచంలో కూరుకుపోయాను. నేను స్క్రీన్ టెస్ట్ కు చాలా ఉత్సాహంగా వెళ్లాను.

మొదటి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. కానీ తెలిసిన వారి ద్వారా సినిమా అవకాశం వచ్చిందని నేను ఉత్సాహపడ్డాను. ఈ లోగా దర్శకుడు నచ్చజెప్పడంతో ఇంట్లోవాళ్లు సుముఖత వ్యక్తంచేశారు. 

ఆ తర్వాత జరిగిన పరిణామాలు గురించి చెప్తూ...మొదటి మీటింగ్‌లోనే అతడి ప్రవర్తన నాకు నచ్చలేదు. అయితే డైరక్టర్ స్క్రీన్ టెస్ట్ నిమిత్తం కొంత ఖర్చు పెట్టి ఉండటంతో నేను కాదనలేకపోయాను. మొదట అవుట్ డోర్ షూట్స్ గురించి ఏమీ చెప్పలేదు.

అలాగే తన భార్య సినిమాని డైరక్ట్ చేస్తుందని చెప్పారు. కానీ అదంతా పేపర్ లోనే. కానీ నిజానికి అంతా అతనే డైరక్ట్ చేసేవాడు. నన్ను తన కూతురు గా చూస్తున్నట్లు అందరికీ చెప్పేవాడు.
 

sexual assault

ఆ క్రమంలో  కొంతకాలానికి అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వాళ్లావిడ పక్కన లేని సమయం చూసి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

దాదాపు ఏడాది పాటు ఇదే పరిస్థితి కొనసాగింది’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. అతడు తననొక శృంగార బానిసగా చూశాడని.. తన బాధను ఎవరితోనూ చెప్పలేకపోయానని ఆవేదన వ్యక్తంచేశారు. 

ఆ సమయంలో నన్ను కూతురు అని రిఫర్ చేస్తూ నా ద్వారా పిల్లలను కనాలని ఉందనటం నన్ను బాగా డిస్ట్రబ్ చజేసింది. అతను నా మైండ్ తో ఆడుకున్నాడు.  

ఆ మానసిక వేదన నుంచి బయిట పడటానికి నాకు ముప్పై సంవత్సరాలు పట్టింది అని చెప్పుకొచ్చింది. అలాగే అతను దారుణంగా  నా ప్రెవేట్ పార్ట్ లలో రాడ్ పెట్టి ఆనందించేవాడు అని చెప్పుకొచ్చింది.
 

అయితే తనను అంత ఇబ్బంది పెట్టిన ఆ దర్శకుడు పేరు మాత్రం ఆమె వెల్లడించలేదు. మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వేధింపుల కేసులను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక  టీమ్ కి మాత్రమే తాను వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.

Latest Videos

click me!