నాని 'హిట్ 3' టీజర్ : హీరోనే ఇలా ఉన్నాడు.. విలన్ ఇంకెంత క్రూరంగా ఉంటాడో.. 

By tirumala AN  |  First Published Sep 5, 2024, 12:55 PM IST

తాజాగా హిట్ 3 మూవీ నుంచి అదిరిపోయే టీజర్ వచ్చింది. ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నాని నటిస్తున్నారు.


నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే మరో చిత్రంపై తన ఫోకస్ షిఫ్ట్ చేశాడు. నాని సినిమాల లైనప్ లో దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో చిత్రం, అదే విధంగా హిట్ 3 ఉన్నాయి. సుజీత్ దర్శకత్వంలో మూవీ గురించి కూడా వార్తలు వస్తున్నాయి. కానీ నాని ముందుగా హిట్ 3 చిత్రాన్ని పూర్తి చేసేందుకు డిసైడ్ అయ్యారు. 

తాజాగా హిట్ 3 మూవీ నుంచి అదిరిపోయే టీజర్ వచ్చింది. ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నాని నటిస్తున్నారు. టీజర్ లో నాని ఎంత పవర్ ఫుల్ అనేది ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించారు. హిట్ ది థర్డ్ కేస్ అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

Latest Videos

హిట్ సిరీస్ ప్రాంచైజీని మొదటి భాగం నుంచి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. హిట్ 3 కి కూడా అతడే డైరెక్టర్. టీజర్ గమనిస్తే.. మంచుకొండల్లో నాని బొలెరో పోలీస్ కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంటాడు. అక్కడ పనిచేసే మరో అధికారికి అలెర్ట్ వస్తుంది. మీ అధికారి ప్రమాదంలో ఉన్నాడు అని. దీనితో ఆ పోలీస్ అతడే ఒక ప్రమాదం అంటూ నానికి ఎలివేషన్ ఇస్తాడు. 

నాని స్మోక్ చేస్తూ స్టైలిష్ గా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. హిట్ 3 చిత్రం క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. గత రెండు భాగాలు కూడా క్రైమ్ థ్రిల్లర్స్ గానే అలరించాయి. క్రైమ్ థ్రిల్లర్ అంటే పవర్ ఫుల్ గా, సైకో మెంటాలిటీ ఉండే విలన్ ఉండాలి. హీరోనే చాలా ప్రమాదకరం అని టీజర్ లో ఎలివేషన్ ఇచ్చారు. అంటే ఇక విలన్ ఇంకెంత క్రూరంగా ఉంటాడో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని 2025 సమ్మర్ లో మే 1 న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. మిక్కిజె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 

click me!