కాళ్ళమీద పడితే ఆర్టిస్ట్ కావన్నారు, సినిమా పేరుతో 5 లక్షలు మోసం... జబర్దస్త్ కమెడియన్స్ చెప్పిన అనుభవాలు!

First Published Jun 9, 2021, 10:17 AM IST

జబర్దస్త్ కమెడియన్స్ అదిరే అభి, రామ్ ప్రసాద్ ఎంత పాప్యులరో అందరికీ తెలిసిందే. తమ మార్కు పంచులతో అలరించే ఈ ఇద్దరు కమెడియన్స్ ఏళ్లుగా జబర్దస్త్ వేదిక ద్వారా ప్రేక్షకులకు హాస్యం పంచుతున్నారు. ఈ స్టార్ కమెడియన్స్ ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొని తమ కెరీర్ గురించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 
 

కెరీర్ బిగినింగ్ లో రామ్ ప్రసాద్ మెడికల్ షాప్ లో పనిచేశారట. అక్కడ డాక్టర్స్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు ఇస్తూ ఉండేవాడినని ఆయన చెప్పారు.
undefined
నటుడు కావాలని పరిశ్రమకు వచ్చిన నేను ఎడిటర్ గా జాయిన్ అయ్యానని రామ్ ప్రసాద్ తెలిపారు. అయితే మనము ఏమి కావాలో పరిశ్రమ డిసైడ్ చేస్తుంది. మనం అనుకున్నది జరగదని ఆటో రామ్ ప్రసాద్ చెప్పారు.
undefined
ఇక ఈ ఆటో కథ ఏమిటని ఆలీ అడుగగా.. నాకు మొదట్నుంచి అవకాశం దొరికితే పంచ్ వేసేవాడిని, అది నేను వెళ్ళిపోయాక వాడికి అర్థం అయ్యేది. అలా నా పంచ్ లకు ఆటో అని మార్క్ పడిపోయింది అన్నారు.
undefined
నా గృహ ప్రవేశానికి మెగాస్టార్ చిరంజీవి గారు బట్టలు పంపారు . ఆయన దగ్గర పనిచేసే గంగాధర్ అనే వ్యక్తి తీసుకువచ్చి అవి నాకు ఇవ్వడం జరిగింది. నాజీవితంలో అది మరచిపోలేని రోజు అని రామ్ ప్రసాద్ గుర్తు చేసుకున్నారు.
undefined
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న అదిరే అభి ప్రభాస్ మొదటి చిత్రం ఈశ్వర్ మూవీతో నా కెరీర్ మొదలైంది. ప్రభాస్, నేను కలిసి ఫస్ట్ షాట్ లో పాల్గొన్నాం అన్నారు.
undefined
బాహుబలి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ చేశానని అదిరే అభి తెలిపారు. ఓ మూవీ విషయంలో నమ్మి రూ. 5 లక్షలు మోసపోయానని, ఆ డబ్బులు తిరిగి రాబట్టుకోవడం కోసం పోలీసు అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చింది అన్నాడు.
undefined
అలాగే ఓ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్లి, కాళ్లను తాకి నటుడు కావాలని ఆశీర్వదించమన్నాను. కాళ్ళ పట్టుకున్నంత మాత్రాన ఆర్టిస్ట్ వి కాలేవని ఆయన అన్నట్లు ఈ సందర్భంగా అభి గుర్తు చేసుకున్నారు.
undefined
నీకు మీ ఆవిడ అంటే భయం అట కదా అని ఆలీ అడుగగా... నిజమే అన్నట్లు ఒప్పుకున్నాడు అభి. ఆలీతో సరదాగా తాజా ప్రోమోలో ఈ విషయాలు పొందుపరచి ఉన్నాయి.
undefined
click me!