మనం రాశి ఖన్నా నటించిన మొదటి తెలుగు చిత్రం. ఆ చిత్రంలో చిన్న క్యామియో రోల్ చేస్తారు. తర్వాత దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఆమెకు ఆఫర్ ఇచ్చారు. నాగ శౌర్యకు జంటగా ఊహలు గుసగుసలాడే మూవీలో రాశికి ఛాన్స్ దక్కింది. అనంతరం జిల్, రాజా ది గ్రేట్, తొలిప్రేమ, జై లవకుశ వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. రాశి ఖన్నా కెరీర్లో బాగా లాభాలు తెచ్చిన సినిమా ప్రతిరోజూ పండగే. దాదాపు రూ. 35 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది.