జబర్ధస్త్ నుండి రోజా అవుట్... కొత్త జడ్జిగా ఇంద్రజ ఎంట్రీ వెనుక కారణం అదే!

First Published Mar 29, 2021, 2:11 PM IST


జబర్ధస్త్ కామెడీ షో ప్రారంభమై ఎనిమిదేళ్లు. 2013లో మొదలైన ఈ కామెడీ షో అనేక బుల్లితెర రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఏళ్లుగా అత్యధిక టీఆర్పీతో ఎదురులేని షోగా నిలిచింది జబర్ధస్త్. అన్నివర్గాల ప్రేక్షకులకు ఇష్టమైన జబర్ధస్త్ షోలో చేసే కమెడియన్స్ కూడా అందరికీ సుపరిచితులే. 

ఇక జబర్ధస్త్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది నాగబాబు, రోజా, అనసూయ, రష్మీ. యాంకర్స్ అనసూయ, రష్మీ జబర్ధస్త్ షో వలన సూపర్ పాపులర్ కాగా, బుల్లితెరపై నటులుగా వెలిగిపోతున్నారు. ఇక జబర్ధస్త్ జడ్జ్ ల గురించి చెప్పాలంటే నాగబాబు ,రోజాలది సూపర్ జోడి.
undefined
నాగబాబు 2019లో జబర్ధస్త్ నుండి బయటికి వచ్చేశారు. రోజా మాత్రం అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతోనే ఉన్నారు. తాజాగా ఆమె కూడా జబర్ధస్త్ నుండి విరామం తీసుకున్నారు. ఆమె ప్లేస్ లో కొత్త జడ్జిగా హీరోయిన్ ఇంద్రజ వచ్చారు.
undefined
తాజా ఎపిసోడ్ లో ఇంద్రజ మరో జడ్జి మనుతో కలిసి షోలో సందడి చేశారు. కమెడియన్స్  జోకులకు సమయస్ఫూర్తితో స్పందిస్తూ ఆకట్టుకున్నారు.
undefined
కమెడియన్స్ వేసే డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఇంద్రజ నవ్వులు పూయించడం విశేషం. ఇక రోజా ప్లేస్ లో గెస్ట్ జడ్జెస్ గా గతంలో మీనా, సంఘవితో పాటు పలువురు హీరోయిన్స్ వచ్చారు.  కొన్ని ఎపిసోడ్స్ తరువాత రోజా యధావిధిగా జబర్ధస్త్ జడ్జిగా ఎంట్రీ ఇచ్చేవారు.
undefined
ఈ సారి ఇంద్రజ మాత్రం కొంతకాలం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.  దానికి కారణం రోజా అనారోగ్యం పాలయ్యారు. ఆమెకు రెండు మేజర్ శస్త్ర చికిత్సలు చేసినట్లు ఆమె బర్త్ సెల్వమణి తెలియజేశారు.
undefined
ప్రస్తుతం రోజా చెన్నై అపోలో ఆసుపత్రిలో ఉన్నారు.  ఈ నేపథ్యంలో ఇంద్రజను జబర్ధస్త్ కొత్త జడ్జిగా రంగంలోకి దింపడం జరిగింది.
undefined
రోజా కోలుకొనే వరకు ఇంద్రజ జడ్జిగా కొనసాగుతారు. ఒకవేళ ఆరోగ్య కారణాల రీత్యా రోజా శాశ్వతంగా జబర్ధస్త్ నుండి తప్పుకుంటే ఇంద్రజ పెర్మినెంట్ జడ్జి కావచ్చు.
undefined
90లలో బిజీ హీరోయిన్ గా వెలుగొందిన ఇంద్రజ ప్రస్తుతం వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు. ఆమె హీరో అక్క, వదిన, అత్త, అమ్మ వంటి రోల్స్ చేస్తున్నారు.
undefined
ఈ మధ్య విడుదలైన అల్లుడు అదుర్స్ మూవీలో ఇంద్రజ నటించారు. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన శతమానం భవతి మూవీలో హీరో మేనత్తగా, హీరోయిన్ తల్లిగా కనిపించారు. మరి జబర్ధస్త్ జడ్జిగా ఇంద్రజ ప్రస్థానం ఎలా సాగుతుందో చూడాలి.
undefined
click me!